Begin typing your search above and press return to search.

ఇంజ‌న్ పేలిన విమానం..గాల్లో 144 మంది ప్రాణాలు!

By:  Tupaki Desk   |   19 April 2018 11:22 AM GMT
ఇంజ‌న్ పేలిన విమానం..గాల్లో 144 మంది ప్రాణాలు!
X
విమానంలో ప్ర‌యాణికులంతా సంద‌డి సంద‌డిగా మాట్లాడుకుంటూ ఉండడం....అంతంలోనే హ‌ఠాత్తుగా విమానంలో సాంకేతిక లోపం ఏర్ప‌డ‌డం......ఇక విమానం క్రాష్ అవ‌బోతోంద‌న్న ఆందోళ‌న‌ల‌లో ప్ర‌యాణికులు త‌మ ఇష్ట దైవాన్ని ప్రార్థించ‌డం....తాము చేసిన త‌ప్పుల‌కు మ‌న్నింపులు కోర‌డం....త‌మ‌వారిని క‌డ‌సారి చూసుకోలేక‌పోతున్నామ‌ని ఆవేద‌న చెంద‌డం...ఎట్ట‌కేల‌కు పైల‌ట్ చాక‌చ్యంతో విమానం సేఫ్ గా ల్యాండ్ అవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకోవ‌డం.....విమానంలో ఆ భ‌యంక‌ర అనుభ‌వాల గురించి మీడియాతో పంచుకోవ‌డం....హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వ‌ర‌కు చాలా సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు కో కొల్ల‌లు. అయితే, తాజాగా, ఇదే త‌ర‌హాలో ఓ ఘ‌ట‌న ఒక‌టి అమెరికాలో జ‌రిగింది.

న్యూయార్క్‌ నుంచి డల్లాస్‌ కు వెళుతోన్న అమెరిక‌న్ ఎయిర్ లైన్స్ విమానంలో ఇంజ‌న్ పేలిపోయిన ఘ‌ట‌న ఇపుడు ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. పైలెట్ చాక‌చ‌క్యంతో విమానం సేఫ్ గా ల్యాండ్ అయింది.

మంగళవారం నాడు 144 మంది ప్రయాణికులతో అమెరికా ఎయిర్ లైన్స్ కు చెందిన ఫ్లైట్‌ నంబర్‌ 1380 న్యూయార్క్‌ నుంచి డల్లాస్‌కు బయల్దేరింది. అయితే, టేక్ ఆఫ్ అయిన కొద్ది సేప‌టికి పేలుడు శబ్దం వినిపించింది. ఇంజన్‌ పేలిపోయిందని తెలియ‌డంతో ప్ర‌యాణికులు తీవ్ర ఆందోళ‌న‌కు లోన‌య్యారు. అంత‌లోనే విమానం ఫ్యాన్‌ బ్లేడ్ రెక్క దూసుకువ‌చ్చి కిటికీ కొద్దిగా ప‌గిలింది. దీంతో, రియోర్డాన్‌ అనే ప్రయాణికురాలు కిటికీలోనుంచి జారి కిందపడబోగా ఆమెను ర‌క్షించారు. ఈ ప‌రిణామంతో ప్ర‌యాణికులంతా బెదిరిపోయారు. త‌మ‌ను కాపాడాలంటూ అంతా భ‌గ‌వంతుణ్ణి ప్రార్థించారు. 20 నిమిషాల పాటు అత్యంత ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు ఎదుర్కొన్న త‌ర్వాత విమానం ల్యాండ్ అయింది. లేడీ పైలట్‌ చాకచక్యంగా ఫిలడెల్ఫియాలో విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేయ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, రియెర్డాన్ ను లోపలికి లాగే ప్ర‌య‌త్నంలో తీవ్ర గాయాలు కావ‌డంతో ఆమె మ‌ర‌ణించింది. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో ఏడుగురు ప్ర‌యాణికుల‌కు గాయాల‌య్యాయి. అంత‌మంది ప్రాణాలు కాపాడిన పైల‌ట్ పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. అమెరికన్‌ నేవీలో పనిచేసిన మొదటి మహిళా పైలట‍్లలో ఒక‌రైన టామ్‌ జో షల్ట్స్ ఈ విమానాన్ని న‌డిపారు. సూపర్‌సోనిక్‌ ఎఫ్‌ జె-18 హార్నెట్స్‌ వంటి విమానాలు నడిపిన టామ్ ....ఇంజన్‌ పేలిపోయినా ధైర్యంగా ల్యాండ్ చేశారు. అయితే, ఇంజన్‌ లోని బ్లేడ్‌ పాతబడటం వల్లే పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు.