Begin typing your search above and press return to search.

ఇన్ఫోసిస్ కు 20వేల మంది కావాలంట‌!

By:  Tupaki Desk   |   13 Oct 2015 9:31 AM GMT
ఇన్ఫోసిస్ కు 20వేల మంది కావాలంట‌!
X
మంచి ఉద్యోగం కోసం క‌ల‌లు క‌నే కుర్రాళ్ల‌కు తీపి క‌బురు ఇది. క్యాంప‌స్ ల‌లో చ‌దువు పూర్తి చేసుకుంటున్న వారు.. కోర్సు పూర్తి అయ్యే లోపు ఏదైనా మంచి కంపెనీలో ఛాన్స్ కొట్టేద్దామ‌ని.. జాబ్ సంపాదిద్దామ‌ని క‌ల‌లు కంటుంటారు. అలాంటి క‌ల‌లు బోలెడ‌న్ని క‌నొచ్చ‌ని ఊరిస్తోంది ఇన్ఫోసిన్‌. ఎందుకంటే.. ఈ కంపెనీ 20వేల మంది ఐటీ ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకోవాల‌ని భావిస్తోంద‌ట‌.

ఇందుకోసం కాలేజీ క్యాంప‌స్ ల‌లో టాలెంట్ ఉన్న విద్యార్థుల‌కు గాలం వేసేందుకు సిద్ధ‌మైంది. ఇందుకోసం వారికి ప్యాకేజీ కూడా సిద్ధం చేసేశారు. క్యాంప‌స్ రిక్రూట్ మెంట్ల ద్వారా రిక్రూట్ చేసుకునే వారికి ప్రారంభ వార్షిక వేత‌నం రూ.3.25ల‌క్ష‌లుగా ఆఫ‌ర్ చేయాల‌ని భావిస్తోంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. గ‌త ఏడాది ఆఫ‌ర్ చేసిన మొత్తాన్నే ఈ ఏడాది ఆఫ‌ర్ చేయ‌టం.

ఇక‌.. ఎంపిక చేసుకున్న ఉద్యోగుల‌కు శిక్ష‌ణ స‌మ‌యంలో ఇచ్చే స్టైఫండ్ విష‌యంలో మాత్రం కాస్తంత క‌రుణ చూపింది. ఇప్ప‌టివ‌ర‌కూ స్టైఫండ్ కింద నెల‌కు రూ.4వేలు ఇస్తుంటే.. ఇక‌పై రూ.10వేలు ఇవ్వాల‌ని భావిస్తోంద‌ట‌. కొత్త‌గా ఉద్యోగాల్లో చేరే వారికి ఐదారు నెల‌ల వ‌ర‌కూ శిక్ష‌ణ ఉండ‌నుంది.

ఈ శిక్ష‌ణ కాలం ముగిసిన వెంట‌నే.. వారి వార్షిక వేత‌నం రూ.3.25లక్ష‌లుగా మారిపోతుంది. గ‌తంలో పోలిస్తే.. ఉద్యోగులు సంస్థ నుంచి వీడే వారి సంఖ్య కాస్త త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని కంపెనీ చెబుతోంది. అయితే.. ఇది చాలా స్వ‌ల‌మ‌ని.. కేవ‌లం 0.1 మాత్ర‌మేన‌ని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ఇన్ఫోసిస్ కొలువుల‌కు భారీగా తలుపులు తెర‌వ‌టం క్యాంప‌స్ విద్యార్థుల‌కు శుభ‌వార్తే సుమా.