Begin typing your search above and press return to search.

ఓ ముస్లిం అధికారి నోటి వెంట షాకింగ్ నినాదాలు

By:  Tupaki Desk   |   20 April 2017 9:48 AM GMT
ఓ ముస్లిం అధికారి నోటి వెంట షాకింగ్ నినాదాలు
X
భార‌త్ మాతాకీ జై అన్న మాట‌ను అనేందుకు సైతం మ‌త విశ్వాసాలకు దెబ్బ‌గా చెబుతుంటారు మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ. నిజానికి ఆయ‌న ఒక్క‌రే కాదు చాలు.. చాలామంది ముస్లింలు ఇలాంటి వాద‌న‌ను వినిపిస్తూ ఉంటారు. దేశానికి.. మ‌త విశ్వాసానికి లింకేమిటో ఒక ప‌ట్టాన అర్థం కాదు. కులం.. మ‌తం లాంటి వాటికి భిన్న‌మైన‌ది దేశం. కానీ.. ఆ కాన్సెప్ట్ చాలామంది ద‌గ్గ‌ర వినిపించ‌దు.క‌నిపించ‌దు. కానీ.. ఇప్పుడు అందుకు భిన్న‌మైన సీన్ ఒక‌టి ఎదురైంది. ఒక అధికారిక స‌మావేశంలో ఒక ముస్లిం ఉన్న‌తాధికారి నోటి నుంచి వ‌చ్చిన నినాదాలు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.

యూపీలోని మొర‌దాబాద్ న‌గ‌రంలోని ఒక పంచాయితీ భ‌వ‌న్‌ లో స‌మాచార‌హ‌క్కు చ‌ట్టంపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించే కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా ఆ రాష్ట్ర స‌మాచార క‌మిష‌న‌ర్ హాఫిజ్ ఉస్మాన్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా రెండు చేతులు పైకెత్తి జై శ్రీరాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయ‌న‌తో పాటు ప్ర‌జ‌లు కూడా పెద్ద ఎత్తున గొంతు క‌ల‌ప‌టంతో ఆయ‌న మ‌రోసారి భార‌త్ మాతాకీ జై అంటూ నినాదాల‌తో హోరెత్తించారు.

ఇదిలా ఉంటే.. అధికారిక కార్య‌క్ర‌మాల్లో మత ప‌ర‌మైన నినాదాలు ఎలా చేస్తారన్న చ‌ర్చ మొద‌లైంది. ఉన్న‌తాధికారి నోటి నుంచి వ‌చ్చిన వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. నినాదాల‌తో సంచ‌ల‌నం సృష్టించిన ఉస్మాన్‌.. త‌న ప్ర‌సంగంలో భాగంగా ట్రిపుల్ తలాక్ మీద కూడా వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌ల‌కు స్వేచ్ఛ క‌ల్పించిన ఏకైక దేశం ఇండియా అని అన్న ఆయ‌న‌.. ట్రిపుల్ త‌లాక్ త‌ప్పు అని.. దీని కార‌ణంగా మ‌హిళ‌లు బాధ ప‌డుతున్నార‌ని వ్యాఖ్యానించారు. ఒక అధికారిక కార్య‌క్ర‌మంలో.. ప‌లువురు సీనియ‌ర్ అధికారులు పాల్గొన్న స‌మావేశంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/