Begin typing your search above and press return to search.

పాక్‌ పై దాడి విషయంలో ఇందిరాగాంధీ..

By:  Tupaki Desk   |   1 Sep 2015 11:03 AM GMT
పాక్‌ పై దాడి విషయంలో ఇందిరాగాంధీ..
X
పాక్‌ పై భార‌త్ సైనిక దాడికి సిద్ధ‌మైంది! కానీ... ఆ త‌రువాత చోటుచేసుకున్న కొన్ని ప‌రిణామాల నేప‌థ్యంలో వెన‌క్కి త‌గ్గింది. ఇది ఇందిరాగాంధీ జ‌మానా నాటి మాట‌. 1980-81... ఆ స‌మ‌యంలోనే పాకిస్థాన్‌ పై సైనిక చ‌ర్య‌ను చేప‌ట్టేందుకు నాటి ప్ర‌ధాని ఇందిరా గాంధీ సిద్ధ‌ప‌డ్డారా? అంటే, అవున‌నే చెప్పాలి! ఎందుకంటే, పాక్ అణు ప‌రిశ్ర‌మ‌ల‌పై భార‌త్ దాడి చేసేందుకు నాడే సిద్ధ‌ప‌డ్డ‌ట్టు... దీనికి సంబంధించి కొన్ని ర‌హ‌స్య డాక్యుమెంట్ ల‌ను అమెరికా గూఢ‌చార సంస్థ (సీఐఏ) ఇటీవ‌లే బ‌య‌ట‌పెట్టింది! ఆ ప‌త్రంలో ఉన్న వివ‌రాలు ఇలా ఉన్నాయి...

1980... ఆ స‌మ‌యంలో పాకిస్థాన్‌ కు ఎఫ్‌-16 యుద్ధ విమానాల‌ను స‌ర‌ఫ‌రా చేస్తోంది అమెరికా. స‌రిగ్గా అదే స‌మ‌యానికి ఇందిరా గాంధీ ప్ర‌భుత్వం కూడా అధికారంలోకి వ‌చ్చింది. వ‌చ్చిన వెంట‌నే, పాక్ కార్య‌క‌లాపాల‌పై ఓ క‌న్నేసి ఉంచింది. అప్ప‌టికే, పాకిస్థాన్ పెద్ద ఎత్తున అణ్వాయుధాల‌ను త‌న అమ్ముల పొదిలోకి స‌మ‌కూర్చుకునే ప‌నిలో ఉంద‌ని స‌మాచారం అందింది. అణ్వాయుధ బ‌లాన్ని పెంచుకునేందుకు చ‌క‌చ‌కా చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్టు తెలిసింది. దీంతో ఇలాంటి స‌మ‌యంలో పాక్‌ పై సైనిక చ‌ర్య‌కు దిగితే క‌రెక్ట్ అని ఇందిరాగాంధీ సర్కారు నాడు అనుకుందిట‌.

పాక్ కి ధీటుగా అణ్వ‌స్త్ర ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించేందుకు కూడా రంగం సిద్ధం చేసింది. దీన్లో భాగంగా థార్ ఎడారి ప్రాంతంలో ఓ భారీ లోయ‌ను కూడా త‌వ్వ‌డం మొద‌లుపెట్టేశారు. ఆ త‌రువాత దాదాపు 40 ట‌న్నుల‌కుపైగా అణ్వాయుధాల‌ను ప‌రీక్షించేందుకు ఏర్పాట్ల‌ను కూడా భార‌త్ చ‌క‌చకా పూర్తి చేసింది. అంతా, జ‌రిగాక‌... పాక్‌ పై సైనిక చ‌ర్య‌కు ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గింది. ఎందుకంటే, పాకిస్థాన్ నిర్వ‌హించ‌నున్న ప‌రీక్ష‌లు కార‌ణంగా భార‌త్‌ కు పెద్ద‌గా న‌ష్టం ఉండ‌బోద‌ని ఇందిరా ప్ర‌భుత్వం భావించి... సైనిక దాడిని విర‌మించార‌ని చెప్పొచ్చు. అలాగే, ముందుగా మ‌న‌మే యుద్ధానికి దిగితే జ‌రిగే న‌ష్ట‌శాతం అంచానా వేసి ఉండొచ్చు.

సీఐఏ విడుద‌ల చేసిన ప‌త్రాల్లో సారాంశం ఇది. ఈ ప‌త్రాలు సీఐఏ వెబ్‌ సైట్‌ లో పెట్టింది. 1981 సెప్టెంబ‌ర్ 8వ తేదీ పేరుతో ఉన్న డాక్య‌మెంట్స్‌ ను వెబ్‌ సైట్‌ లో పెట్టారు.