Begin typing your search above and press return to search.

భార‌త విద్యార్థిపై తెల్ల‌జాతీయుడి జాత్య‌హంకారం!

By:  Tupaki Desk   |   14 Jun 2018 5:33 AM GMT
భార‌త విద్యార్థిపై తెల్ల‌జాతీయుడి జాత్య‌హంకారం!
X
క‌ళ్ల ముందు జ‌రుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాలంటే గుండె ధైర్యం అవ‌స‌రం.అందులోని త‌న‌కు సంబంధం లేని విష‌యం మీద పోరాడ‌టం అంటే చిన్న విష‌యం కాదు. అన్నింటికి మించి దేశం కాని దేశంలో అంటే క‌ళ్ల ముందు జ‌రిగే అన్యాయాన్ని ఎదిరించటం సామాన్య‌మైన విష‌యం కాదు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఎప్పుడు ఎక్క‌డ జాత్యాంహ‌కారాన్ని ప్ర‌ద‌ర్శిస్తారో తెలీని వేళ‌లో క‌ళ్ల ముందు జ‌రుగుతున్న అన్యాయాన్ని ఎదిరించ‌టం ఒక ఎత్తు అయితే.. ఈ సంద‌ర్భంగా షాకింగ్ ప‌రిణామాన్ని ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ఇంత‌కీ ఈ త‌ర‌హా ఉదంతం ఎక్క‌డ చోటు చేసుకుంది? అన్న‌ది చూస్తే..

అగ్ర‌రాజ్యమైన బ్రిట‌న్ రాజ‌ధాని లండ‌న్ అమాన‌మీయ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఒక ముస్లిం మ‌హిళ‌ను ఉద్దేశించి ఒక శ్వేత‌జాతీయుడు అస‌భ్యంగా మాట్లాడ‌టాన్ని భార‌త విద్యార్థి ఖండించాడు. దీనికి రెచ్చిపోయిన స‌ద‌రు శ్వేత‌జాతీయుడు మా దేశం వ‌దిలి వెళ్లిపో అంటూ దుర్బాష‌లాడిన వైనం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా సాగుతోంది. శ్వేత‌జాతీయుడి దుర‌హంకారం వీడియో రూపంలో ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చి.. అగ్రరాజ్యంలో ఇదేం అనాగ‌రికమ‌న్న‌ది చ‌ర్చ‌గా మారింది.

భార‌త విద్యార్థి అయిన28 ఏళ్ల రికేశ్ అడ్వాణీ కేంబ్రిడ్జ్ వ‌ర్సిటీలో రాజ‌కీయ త‌త్వ‌శాస్త్రాన్ని చ‌దువుతున్నాడు. ఈ మ‌ధ్య ప‌నిలో భాగంగా కేంబ్రిడ్జ్ ఆసుప‌త్రికి వెళ్లాడు. ముఖానికి ముసుగేసుకున్న ఒక మ‌హిళ ఆసుప‌త్రికి వ‌చ్చారు. త‌న బ్యాగ్ తీసుకోవ‌టానికి కింద‌కు వంగిన‌ప్పుడు ఆమెను చూసిన తెల్ల‌జాతీయుడు ఒక‌డు వెకిలిగా మాట్లాడ‌ట‌మే కాదు.. లైంగిక కోరిక‌ను ధ్వ‌నించేలా ద్వందార్థాల్ని ప్ర‌యోగించాడు. అక్క‌డే ఉన్న రికేశ్ ఈ ప‌రిణామాన్ని త‌ప్పు ప‌ట్టాడు.

అలా మాట్లాడ‌టం స‌రికాదంటూ వారించే ప్ర‌య‌త్నం చేశాడు. దీంతో రెచ్చిపోయిన తెల్ల‌జాతీయుడు రికేశ్ పై ప‌రుష వ్యాఖ్య‌లు చేయ‌టంతో పాటు.. రాయ‌లేని బూతుమాట‌ల్ని ఉప‌యోగించాడు. నోటికి వ‌చ్చిన‌ట్లు తిట్టి.. తీవ్ర‌మైన భాష‌ను ప్ర‌యోగించాడు.

ఇంత జ‌రుగుతున్నా.. చుట్టూ ఉన్న వారెవ‌రూ శ్వేత‌జాతీయుడి తీరును త‌ప్పు ప‌ట్ట‌లేదు. అత‌డి తిట్ల పురాణాన్ని ఆపే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. జ‌రిగిన ఘ‌ట‌న‌పై రికేశ్ పోలీసుల‌కు కంప్లైంట్ చేశాడు. అయితే.. ఇప్ప‌టివ‌ర‌కూ దీనికి బాధ్యుడైన వ్య‌క్తిని అదుపులోకి తీసుకోలేదు. అయితే.. త‌మ ఆసుప‌త్రికి వ‌చ్చిన రికేశ్‌కు స‌రైన ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేక‌పోయామంటూ కేంబ్రిడ్జ్ ఆసుప‌త్రి మాత్రం సారీ చెప్పేసింది. క‌ళ్ల ముందు జ‌రుగుతున్న అన్యాయాన్ని త‌ప్పు ప‌ట్టినా.. ప‌ట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన వైనాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.