Begin typing your search above and press return to search.

ఎన్నారై హత్య కేసు : డైరీనే పట్టించింది..

By:  Tupaki Desk   |   23 Jun 2018 7:50 AM GMT
ఎన్నారై హత్య కేసు : డైరీనే పట్టించింది..
X
ఈ ప్రపంచంలో మనం ఎక్కువగా నమ్మేది తల్లి - భార్యలనే.. జీవితంలో భార్య స్థానం ఇంకా గొప్పది. కానీ కట్టుకున్న భర్తనే కాటికి పంపింది ఈ కసాయి భార్య. భార్యతో నాలుగేళ్లు కాపురం చేసి కొడుకు పుట్టాక కూడా గతి తప్పింది. పాత పరిచయం అక్రమ సంబంధంగా మారిన వేళ.. కట్టుకున్న భర్తను తన చేతులతోనే నమ్మించి మరీ చంపేసింది. ఈ దారుణ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. భర్త ను చంపిన సోఫియాకు తాజాగా ఆస్ట్రేలియాలోని కోర్టు 22 ఏళ్ల కఠిన శిక్ష విధించింది. కుట్ర పన్నిన ఆమె ప్రియుడు అరుణ్ కమలాసనన్ కు 27 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసు విచారణలో పోలీసులకు సోఫియా సీక్రెట్ రాసుకున్న డైరీనే ప్రధాన సాక్ష్యంగా దొరకడం విశేషం. అందులో అరుణ్-సోఫియా ప్రేమ కార్యకలాపాలన్నీ రాసుకోవడమే ఆమె దొరికిపోయింది.

కేరళకు చెందిన సామ్ అబ్రహం - అతడి భార్య సోఫియా - కుమారుడితో కలిసి 2012లో ఆస్ట్రేలియాకు ఉద్యోగ నిమిత్తం వెళ్లి సెటిల్ అయ్యాడు. మూడేళ్లు ఉద్యోగం చేశాక 2015 అక్టోబర్ 13న సామ్ అబ్రహం హఠాత్తుగా మరణించాడు. ఈ విషయాన్ని కేరళలో ఉన్న సామ్ కుటుంబ సభ్యులకు సోఫియా కన్నీరు కారుస్తూ తెలిపింది. గుండెనొప్పితో సామ్ మరణించాడని భోరున విలపించింది. అయితే పోస్టుమార్టంలో మాత్రం సామ్ గుండెనొప్పి కాదు.. విషప్రయోగం వల్లే చనిపోయాడని తేలింది. దీంతో స్థానిక పోలీసులు ఈ కేసును చాలెంజింగ్ గా తీసుకొని సోఫియాపై నిఘా పెట్టారు. సామ్ చనిపోయిన కొద్ది రోజుల తర్వాత కేరళకు చెందిన అరుణ్ కమలాసనన్ తో సన్నిహితంగా మెలగడం చూసారు. ప్రాథమిక విచారణ అనంతరం సోఫియా - అరుణ్ లను అదుపులోకి తీసుకొని విచారించగా ఘోరం బయటపడింది..

కేరళకు చెందిన సోఫియా - అరుణ్ కమలాసనన్ లు ఇద్దరూ ప్రేమికులు. వీరు గాంధీ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నారు. అప్పుడే వారి మధ్య స్నేహం, ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వీరి పెళ్లికి ఇరుకుటుంబాలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ వేరే వేరే పెళ్లిళ్లు చేసుకున్నారు. సోఫియాకు ఒక కొడుకు, అరుణ్ కు ఇద్దరు పిల్లలు కలిగాక మరోసారి వీరి మధ్య అక్రమ సంబంధం పురుడుపోసుకుంది.. అరుణ్ ఇండియాలోని తన భార్య పిల్లలను వదిలేసి ఆస్ట్రేలియా వచ్చి సామ్ ను చంపేందుకు సోఫియాతో కుట్ర చేశాడు. అందులో భాగంగానే 2015 అక్టోబర్ లో సామ్ కు సెనైడ్ కలిపిన ఆరేంజ్ జ్యూస్ ఇచ్చి అతడిని సోఫియా సాయంతో చంపించేశాడు. అనుమానం రాకుండా సామ్ కు గుండెపోటు వచ్చిందని సోఫియా నాటకాలాడింది. కానీ పోస్టుమార్టంలో బయటపడడంతో నిజం నిర్ధారణ అయ్యింది. విచారణలో డైరీనే కీలకంగా మారి వీరి గుట్టును బయటపెట్టింది.