Begin typing your search above and press return to search.

ఎన్నారైలు దొరికిపోయారు.. 20 ఏళ్లు జైలు?

By:  Tupaki Desk   |   2 Dec 2016 2:06 PM GMT
ఎన్నారైలు దొరికిపోయారు.. 20 ఏళ్లు జైలు?
X
అమెరికాలో ఇద్దరు ప్రవాస భారతీయులు ఆర్థిక లావాదేవీల కేసులో చిక్కుకున్నారు. వీరి మీద నేరం రుజువైతే ఏకంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడేందుకు ఆస్కారముంది. నందు తొండవాడి.. ధ్రువ్ దేశాయ్ లను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లిద్దరూ షాంబర్గ్ లోని తమ సాఫ్ట్ వేర్ కంపెనీ క్వాడ్రెంట్-4 సిస్టమ్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఈ ఏడాది మే నెలలో సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ కు తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చినట్లు తేలింది. వీళ్లిద్దరినీ ఫెడరల్ కోర్టులో హాజరు పరిచారు. వీళ్లను కోర్టు దోషులుగా ప్రకటిస్తే గరిష్టంగా 20 ఏళ్లు జైలు శిక్ష పడేందుకు ఆస్కారమున్నట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. వీళ్లు చేసింది తీవ్ర నేరంగా భావిస్తున్నారు.

వీసా కేసులో మరో ఎణ్నారై..

మరోవైపు స్టూడెంట్ వీసా మోసంలో మరో ఎన్నారై అమెరికాలో పోలీసుల చేతికి చిక్కాడు. 45 ఏళ్ల తేజేష్ కొడాలి అనే ఎన్నారై.. రెండు మిడిలెసెక్స్ కౌంటీ సంస్థలకు సీఈవో కమ్ మేనేజర్ గా ఉన్నాడు. అతను కొందరు విదేశీయులకు దొంగ స్టూడెంట్ వీసాలు సమకూర్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. తేజేష్ కొడాలి పోలీసుల వద్ద తన నేరాన్ని ఒప్పుకున్నాడు. కొన్ని యుఎస్ కంపెనీలకు విదేశీయుల్ని ఐటీ కన్సల్టంట్లుగా పరిచయం చేసినందుకు తనకు కమిషన్లు అందేవని అతను అంగీకరించాడు. తేజేష్.. అతడి కంపెనీ తరఫున 37 దాకా నకిలీ స్టూడెంట్ వీసాల్ని తయారు చేసినట్లు తెలుస్తోంది. నేరం రుజువైతే తేజేష్ కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా కూడా పడేందుకు ఆస్కారముంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/