Begin typing your search above and press return to search.

ఆ పేరు విని ఉద్యోగం ఇవ్వమంటున్నారట

By:  Tupaki Desk   |   20 March 2017 5:22 PM GMT
ఆ పేరు విని ఉద్యోగం ఇవ్వమంటున్నారట
X
పేరులో ఏముంది..స‌త్తా ఉంటే చాలు అనుకుంటాం కానీ పేరులోనే చాలాచాలా ఉంటుంది. మ‌న తెలుగు లోగిళ్ల‌లో ఎవ‌రినైనా సూర్య‌కాంతం అని పిలిచాం అనుకోండి గ‌య్యాళి త‌నానికి కేరాఫ్ అడ్ర‌స్ లాగా అమెను డిసైడ్ అయిపోతారు. నార‌దుడు అనే పేరు ఎవ‌రికైనా ఉంటే కాస్త అనుమానంగా చూడాల్సి వ‌స్తుంది. అయితే ప్ర‌స్తుతం కాలంలో పేర్లు ప్ర‌భావం చూపుతాయా? టాలెంట్ వేదిక‌గా ప్ర‌పంచం ముందుకు పోతున్న‌ది క‌దా. పేరుతో సంబంధం లేకుండా దుమ్మురేప‌చ్చు అనుకుంటున్నారా? ఒక్క‌సారి ఈ నిజ‌జీవిత గాథ చదివితే మీ అభిప్రాయం మారిపోతుంది.

జార్ఖండ్‌ లోని జంషెడ్‌ పూర్‌ కు చెందిన ఆ యువ‌కుడు మెరైన్ ఇంజినీరింగ్‌ లో డిగ్రీ పట్టా పొందాడు. తన బ్యాచ్‌ లో సెకండ్ టాపర్‌ గా నిలిచాడు. పట్టా పొంది దాదాపు మూడేళ్లు అవుతోంది. అయినా ఆ యువకునికి ఎక్కడా ఉద్యోగం లభించలేదు. ఉద్యోగం కోసం వివిధ మల్టీనేషనల్ షిప్పింగ్ కంపెనీల్లో 40 సార్లు ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. ఆ ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. దీనికి అంతటికీ కారణం ఏంటో తెలుసా? ఆయ‌న పేరు. ఓ ముస్లిం ప్ర‌ముఖుడి పేరు పెట్టుకున్నందుకు ఆయ‌న ఉద్యోగం కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నాడు.

ఇంత‌కీ ఆయ‌న పేరు ఏంటో తెలుసా? సద్దాం హుస్సేన్! 25 ఏళ్లు క‌ల ఈ యువ‌కుడు ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే ఆయ‌న‌కు ఆల‌స్యంగా తెలిసిందే ఏంటంటే....పేరు కారణంగా ఉద్యోగం దక్కడం లేదని. ఈ విష‌యాన్ని ప‌లు కంపెనీ మానవవనరుల విభాగాల ద్వారా తెలుసుకున్నారు. దీంతో పేరు మార్పిడి కోసం డిసైడ‌య్యాడు. మొదట ఇంజినీరింగ్ చదివిన యూనివర్సిటీని ఆశ్రయించాడు. 10, 12 తరగతుల ధ్రువీకరణ పత్రాల్లో పేరు మార్చుకుంటేనే ఇంజినీరింగ్ పట్టాలో పేరు మారుస్తామని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో సీబీఎస్‌సీని ఆశ్రయించాడు. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో చివరి ప్రయత్నంగా న్యాయం కోసం జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాడు. ఇది పేరులో నేముంది అనే వ్య‌క్తి ఆస‌క్తిక‌ర‌మైన గాథ‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/