టీమిండియాపై బీసీసీఐ వరాల జల్లు

Sun Sep 22 2019 16:50:36 GMT+0530 (IST)

ప్రపంచంలోనే అత్యంత థనవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ. దేశానికి ప్రాతినిధ్యం వహించడం కోసం యువ ఆటగాళ్లు తపిస్తారు. ఒక్కసారి జట్టులోకి ఎంపికైతే ఇక వారి జీవితం సెటిల్ అయినట్టే. అంత భారీగా సంపాదన క్రికెటర్లకు వస్తుంది.అయితే ఆటగాళ్లతో బీసీసీఐ క్రికెటర్లతో సంవత్సరానికి కాంట్రాక్ట్ కుదుర్చుకొని ఆ మేరకు చెల్లింపులు చేస్తుంటుంది. ఇప్పటికే కోట్లలో ఆటగాళ్ల జీతభత్యాలున్నాయి.

తాజాగా బీసీసీఐ పాలక కమిటీ ఆటగాళ్లకు ఇస్తున్న రోజువారీ భత్యాన్ని రెట్టింపు చేసింది. ఇప్పటివరకు ఆటగాళ్లకు రోజువారీగా ఖర్చుల కింద 125 డాలర్లు ఇచ్చేవారు. ఇప్పుడది 100 డాలర్లు పెంచి ఏకంగా 250 డాలర్లు రోజువారీ ఖర్చు ఇస్తున్నారు. ఈ మేరకు బీసీసీఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) నిర్ణయం తీసుకుంది.

250 డాలర్లు అంటే మన భారత కరెన్సీలో అక్షరాల 17800 రూపాయలు. రోజువారి ఆటగాళ్లు బయట ఖర్చు చేసుకోవడానికి ఈ మొత్తం వాడుకోవాలి. ఇక ఆటగాళ్ల బసల - లాండ్రీ - ఇతర ఖర్చులను సైతం పూర్తిగా బీసీసీఐ భరిస్తుంది. ఈ 17800 అనేది పూర్తిగా క్రికెటర్ల వ్యక్తిగత ఖర్చు అన్నమాట.. సో మన క్రికెటర్ల పంట పండినట్టే..