Begin typing your search above and press return to search.

భారత టీనేజర్ ను చంపిన పాక్ టీనేజర్

By:  Tupaki Desk   |   7 Oct 2015 3:11 PM GMT
గగుర్పాటుకు గురి చేసే ఉన్మాదపు చర్య ఇది. పద్నాలుగేళ్ల పసిప్రాయంలో ఉన్న పాక్ కుర్రాడు.. ఓ టీనేజర్ మీద మనసు పడ్డాడు. ఆ అమ్మాయి వయసు కూడా పద్నాలుగేళ్లే. మంచి డ్యాన్సర్ కావాలన్న తలంపులో ఉన్న ఆ టీనేజర్.. ఈ కుర్రాడి మాటకు నో చప్పేసింది.

తనను.. తన ప్రేమను కాదందన్నకోపంతో సదరు భారతీయ టీనేజర్ చంపేశాడు పాక్ కు చెందిన టీనేజర్. ఈ దుర్మార్గ ఘటన దుబాయ్ లో చోటు చేసుకుంది. సదరు టీనేజర్ తల్లి ఉద్యోగం కోసం ఇంట్లో నుంచి వెళ్లిన వెంటనే.. సదరు బాలిక ఇంట్లోకి ప్రవేశించిన పాక్ టీనేజర్ ఆ అమ్మాయిని చంపేయటమే కాదు.. తన మీద కిరోసిన్ పోసుకొని.. సదరు బాలికను తగలబెట్టేశాడు. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తుసాగుతోంది. పాక్ టీనేజర్ దుశ్చర్యపై విస్మయం వ్యక్తమవుతోంది.