Begin typing your search above and press return to search.

పెట్రోలు బంకు కావాలా నాయనా..!!

By:  Tupaki Desk   |   4 Aug 2015 8:58 AM GMT
పెట్రోలు బంకు కావాలా నాయనా..!!
X
పెట్రోలు బంకు పెట్టాలంటే దానికి పెద్ద ప్రాసెస్... పెట్టుబడీ ఎక్కువే... అంతేకాదు, అనుమతి తెచ్చుకోవడానికి చాలా పరపతి, పలుకుబడి, రాజకీయ అండదండలు అన్నీ ఉండాలి. అంతేకాదు... పెట్రోల్ బంక్ ఉంటే సోషల్ స్టేటస్.. ఆ హోదాయే వేరు... ఇంతకుముందు రాజకీయ నేతలకు, బడావ్యాపారవేత్తలకే పెట్రోలు బంకులుండేవి. ఇటీవల కాలంలో రిజర్వేషన్ల అమలుతో ఇతరులకూ వస్తున్నాయి. ఇంతవరకు ఉన్న నిబంధనల ప్రకారం పెట్రోలు బంకు పెట్టడం అంత సులభమయ్యేది కాదు.. కానీ తాజాగా చమురు సంస్థలు నిబంధనలు సవరిస్తుండడంతో ఇష్టమైనచోట పెట్రోలు బంకులు పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాదు.. రిజర్వేషన్లు, ఇతర నిబంధనలూ లేవు. స్థలం, పెట్రోలు బంకు ఏర్పాటు చేయగలిగే ఆర్థిక స్తోమత ఉంటే చాలు. కోరిన వెంటనే బంకు మంజూరు చేస్తారు.

పెట్రోలు, డీజిల్ ను ఇప్పుడు చమురు సంస్థలు మార్కటు రేటుకే విక్రయిస్తున్నాయి. దీతో రిలయన్స్, ఎస్సార్ ఆయిల్ వంటి సంస్థలు అవుట్ లెట్లు ఏర్పాటుచేయనున్నాయి. గతంలో రిలయన్స్ ఇలాంటి బంకులు పెట్టి మూసేసింది.. వీటిలో చాలావరకు ఇప్పుడు మళ్లీ తెరుచుకున్నాయి. దీంతో చమురు సంస్థలు కోరిన వెంటనే కోరిన చోట అనుమతించేలా కేంద్రాన్ని కోరుతున్నాయి. ఇది ఓకే అయ్యే సూచనలున్నాయి. కేంద్రం పచ్చజెండా ఊపితే ఇక మీరూ ఓ పెట్రోలు బంకు ఓనరైపోవచ్చు.