Begin typing your search above and press return to search.

భారత్-పాక్ మ్యాచ్ లో ప్రేమ.. వైరల్ వీడియో

By:  Tupaki Desk   |   24 Jun 2019 6:15 AM GMT
భారత్-పాక్ మ్యాచ్ లో ప్రేమ.. వైరల్ వీడియో
X
ఈ ప్రపంచ కప్ లోనే ఉత్కంఠగా సాగిన మ్యాచ్ భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన క్రికెట్ సమరం. ఈ మ్యాచ్ ఎంతో ఉద్వేగాన్ని పంచింది. ఎన్నో సంబరాలను, విషాధాలను రెండు దేశాల అభిమానులకు పంచింది. భారత్ గెలిచి అభిమానులు సంబరాలు చేసుకోగా.. ఓడిన పాకిస్తాన్ అభిమానులు ఆ దేశ క్రికెటర్లను తిట్టి పోస్తున్నారు..

అయితే ఈ మ్యాచ్ లోనే ఓ ప్రేమ చిగురించడం విశేషం. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. భారత్ -పాక్ మ్యాచ్ చూడడానికి వచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య స్నేహం ప్రేమగా మారిన ఘట్టం ఆవిష్కృతమైంది.

భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుండగా.. భారత్ బ్యాంటింగ్ చేస్తుండగా గ్యాలరీలో కూర్చున్న అన్వితా అనే యువతికి ఆమె ప్రియుడు ప్రేమ ప్రపోజ్ చేశాడు. ఓ ఉంగరాన్ని ఆమెకు తొడిగి లవ్ యూ చెప్పాడు. ఈ అద్భుత ప్రపోజల్ కు ఆశ్చర్యపోయిన ఆమె ఆ ప్రేమకు ఓకే చెప్పింది. అనంతరం ప్రియుడు విక్కీ ఓ ఉంగరాన్ని ఆమెకు తొడిగాడు. అనంతరం ఇద్దరూ గట్టిగా హత్తుకొని ముద్దులు పెట్టుకున్నారు.

ఇక ఈ తతంగమంతా వారి స్నేహితులు వీడియో తీశారు. ప్రేమికులను ఉత్సాహపరిచారు. సదురు యువతి అన్విత స్వయంగా వీడియోను షేర్ చేసింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లోనే వీరి ప్రేమ చిగురించడం.. ఆ వీడియో వైరల్ కావడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వీరిద్దరి ప్రేమను ఇప్పుడు అందరూ స్వాగతిస్తున్నారు.