అమెరికాలో తెలుగుదంపతుల మృతి

Tue Feb 19 2019 11:32:43 GMT+0530 (IST)

అమెరికాలో తెలుగు దంపతుల మృతి కలకలం రేపింది. సోమవారం రాత్రి టెక్సాస్ రాష్ట్రంలోని షుగర్ ల్యాండ్లో పోలీసులకు కాల్పుల ఘటన ఇద్దరి మృతిపై ఫిర్యాదు రాగా వెళ్లి పరిశీలించారు. ఇందులో ఇంట్లో పడి ఉన్న 51 ఏళ్ల నకిరేకెంటి శ్రీనివాస్ ఆయన భార్య శాంతి నకిరేకంటి (46) మృతదేహాలను గుర్తించారు. వీరిద్దరూ తెలుగు వారే కావడం గమనార్హం.శాంతి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ఆమె తల కణతపై బుల్లెట్ గాయం ఉండడాన్ని గమనించారు. తుపాకీతో ఆమె కణతపై కాల్చి చంపినట్టు నిర్ధారించారు. ఇక శ్రీనివాస్ మృతదేహాన్ని బెడ్ రూంలో గుర్తించారు. ఆయన చాతిపై బుల్లెట్ గాయం ఉంది. ఆయన కడుపుపై తుపాకీ పడి ఉంది. దీన్ని బట్టి  శ్రీనివాస్ తన భార్యను హత్య చేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు.

దంపతుల ఆత్మహత్య జరిగినప్పుడు వారి 16 ఏళ్ల కూతురు అక్కడే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. విచారణ జరిగేటప్పడు ఆమె పోలీసులకు అసలు విషయాలను వెల్లడించినట్టు సమాచారం. శ్రీనివాస్ ఆత్మహత్యకు ముందు చాలా మంది సన్నిహితులతో మాట్లాడినట్టు.. మెయిల్స్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. సూసైడ్ నోట్ కూడా రాశారని.. కానీ అది అస్పష్టంగా ఉన్నట్టు సమాచారం.

శ్రీనివాస్ హూస్టన్ లోని ఒక ఎనర్జీ లిమిటెడ్ సంస్థలో డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఆయన భార్య శాంతి ఎంఎన్సీలో ప్రోగ్రాం అసోసియేటెడ్ గా పనిచేస్తున్నారు. వీరిద్దరి మరణంతో స్థానికులు తెలుగువారు షాక్ కు గురయ్యారు.  వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారిని.. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో అంతుబట్టడం లేదని పక్కనున్న వారు పోలీసులుతో తెలిపారు. దంపతుల మరణానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.