Begin typing your search above and press return to search.

మాల్యా మెడకు మ‌నీ ల్యాండ‌రింగ్ ఉచ్చు

By:  Tupaki Desk   |   22 April 2017 7:49 AM GMT
మాల్యా  మెడకు మ‌నీ ల్యాండ‌రింగ్ ఉచ్చు
X
లిక్క‌ర్ బార‌న్ విజ‌య్ మాల్యా టాలెంట్ సంబంధించిన మ‌రో కోణం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆయ‌న మ‌నీ ల్యాండ‌రింగ్‌ కు పాల్ప‌డ్డారనే అనూహ్య‌మైన వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు ఎన్‌ ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ ద‌గ్గ‌ర ఉన్నాయి. భార‌తీయ బ్యాంకుల నుంచి తీసుకున్న డ‌బ్బును మాల్యా అక్ర‌మంగా బ్రిటీష్ కంపెనీల‌కు చేర‌వేసిన‌ట్లు ఈడీ ఆరోపిస్తోంది. బ్రిట‌న్ ప్ర‌భుత్వానికి ఆ డాక్యుమెంట్ల‌ను ఈడీ స‌మ‌ర్పించినట్లు తెలుస్తోంది. సుమారు 9 వేల కోట్ల బ్యాంక్ రుణాల‌ను ఎగ్గొట్టిన మాల్యా బ్రిట‌న్‌ లో త‌ల‌దాచుకుంటున్న విష‌యం స‌మాచారం.

గ‌త ఏడాది మార్చి 2వ తేదీన మాల్యా దేశం విడిచి పారిపోయాడు. అయితే దానికంటే ముందు భార‌త బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల‌ను మాల్యా బ్రిట‌న్‌ లో ఉన్న త‌న షెల్ కంపెనీల‌కు ట్రాన్స‌ఫ‌ర్ చేసిన‌ట్లు ఆధారాలున్నాయి. బ్రిట‌న్‌ - కేమ‌న్ ఐలాండ్స్‌ - మారిష‌స్‌ తో పాటు మ‌రికొన్ని దేశాల‌కు మాల్యా మ‌నీ ల్యాండ‌రింగ్ చేసిన‌ట్లు ఈడీ త‌న నివేదిక‌లో పేర్కొంది. బ్యాంకు రుణాల‌ను ఎగ్గొట్టిన కేసులో గ‌త సోమ‌వారం లండ‌న్ పోలీసులు మాల్యాను అరెస్టు చేసి ఆ త‌ర్వాత వెంట‌నే విడుద‌ల చేశారు. సుమారు ఆరున్న‌ర ల‌క్ష‌ల పౌండ్ల బెయిల్‌ పై అత‌న్ని విడుద‌ల చేశారు. బ్రిట‌న్‌ కు చెందిన క్రౌన్ ప్రాసిక్యూష‌న్ స‌ర్వీస్ భార‌త ప్ర‌భుత్వం త‌ర‌పున మాల్యా కేసును వాదించ‌నుంది. అయితే మాల్యాను భార‌త్‌ కు అప్ప‌గించాల‌న్న అంశంపై మాత్రం బ్రిట‌న్‌ లో చాలా ప్ర‌క్రియ‌లు పూర్తి చేయాల్సి ఉంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/