Begin typing your search above and press return to search.

దేశంలో 5జీ సేవ‌ల లెక్క‌లు వ‌చ్చేశాయ్‌!

By:  Tupaki Desk   |   13 Jun 2018 6:02 AM GMT
దేశంలో 5జీ సేవ‌ల లెక్క‌లు వ‌చ్చేశాయ్‌!
X
మొబైల్ ప్లాట్ ఫాం మీద దేశం దూసుకెళుతోంద‌ని.. టెలికం రంగం అద్భుతంగా సాగుతుంద‌న్న మాట‌ల‌కు కొద‌వ లేదు. చూస్తున్నంత‌నే 2జీ స్థానే 3జీ రావ‌టం.. దానికి అల‌వాటు ప‌డేంత‌లోనే 4జీ వ‌చ్చేయ‌టం తెలిసిందే. 4జీ కార‌ణంగా ల‌భించే సేవ‌ల్ని పూర్తిస్థాయిలో అనుభ‌వించ‌క ముందే.. 5జీ మాట వ‌చ్చేసింది. అంతేనా.. దేశ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చేసే స‌మ‌యం ఆస‌న్న‌మైందంటూ ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

5జీ సేవ‌లు రావ‌టం త‌ర్వాత‌.. ఇప్పుడున్న 4జీ సేవ‌లైనా స‌రిగా ఉన్నాయా? అంటే లేవ‌నే చెప్పాలి. ఇప్ప‌టికి కాల్ డ్రాప్స్‌.. సిగ్న‌ల్ స‌రిగా లేక‌పోవ‌టం.. క‌నెక్టివిటీ ఆప్ అండ్ డౌన్ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ప‌రిస్థితి. ఇన్ని స‌మ‌స్య‌లున్నా.. వాటి ప‌రిష్కారం కోసం పెద్ద‌గా దృష్టి పెట్ట‌ని టెలికం కంపెనీలు 5జీ ఆధారిత స‌ర్వీసుల్ని మాత్రం అందుబాటులోకి తెచ్చేయ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

ఎరిక్స‌న్ మొబిలిటీ రిపోర్ట్ ప్ర‌కారం 2018 చివ‌రి నాటికి వాణిజ్య ప‌రంగా 5జీ సేవ‌లు స్టార్ట్ కావొచ్చ‌ని చెబుతున్నారు. 2022 నాటికి 5జీ సేవ‌లు అంద‌రికి అందుబాటులోకి వ‌చ్చేస్తాయంటున్నారు. ఇక‌.. 4జీ సర్వీసులు వాడే వారి సంఖ్య 2023 చివ‌రి నాటికి 78 వాతానికి పెరుగుతాయ‌ని.. అదే స‌మ‌యంలో 5జీ చందాదారులు కోటి మార్క్ ను ట‌చ్ చేస్తుందంటున్నారు.

2017 ముగిసే నాటికి 4జ చందాదారుల వాటా 20 శాతంఉండ‌గా.. 2023 నాటికి మొత్తం మొబైల్ చందాదారుల్లో 78 శాతం ఎల్ టీఈవే ఉంటాయ‌ని చెబుతున్నారు. ఈ స‌మ‌యానికి ప్ర‌పంచ వ్యాప్తంగా 4జీ క‌నెక్ష‌న్లు దాదాపు 550 కోట్ల వ‌ర‌కూ ఉండే వీలుందంటున్నారు.

ఇదిలా ఉండ‌గా.. భార‌త్ లో స్మార్ట్ పోన్ల వినియోగం 2023 నాటికి 97 కోట్ల‌కు చేర‌తుంద‌ని అంచ‌నా వేశారు. 2017 చివ‌రి నాటికి స్మార్ట్ ఫోన్లు 38 కోట్లే కావ‌టం గ‌మ‌నార్హం. 5జీ సేవ‌ల్ని వినియోగించుకోవ‌టానికి వీలుగా అవ‌స‌ర‌మ‌య్యే ఫోన్లు 2018 చివ‌రి నాటికి రావొచ్చ‌ని.. ఒక‌వేళ ఆల‌స్య‌మైతే 2019 మొద‌టి ఆర్నెల్ల‌లో రావ‌టం ఖాయ‌మంటున్నారు.

అంత‌ర్జాతీయంగా మొబైల్ చందాదారుల విష‌యంలో భార‌త్ కు రెండో స్థానం ద‌క్కింది. 2018 మొద‌టి మూడు నెల‌ల్లో నిక‌రంగా 1.6 కోట్ల చందాదారులు పెరిగారు. దీంతో.. మొత్తం చందాదారుల సంఖ్య 118 కోట్లుగా మారింది. ఇక‌.. చైనా విష‌యానికి వ‌స్తే ఈ ఏడాది మొద‌టి మూడునెలల్లో ఏకంగా 5.3 కోట్ల క‌నెక్ష‌న్లు పెర‌గ‌టం విశేషం. తాజాగా చైనాలో మొబైల్ చందాదారుల సంఖ్య 147 కోట్ల‌కు చేరుకోవ‌టం గ‌మ‌నార్హం.