Begin typing your search above and press return to search.

ప్రపంచ టెస్ట్ క్రికెట్లో భార‌త్ స‌రికొత్త రికార్డులు

By:  Tupaki Desk   |   14 Oct 2019 4:26 AM GMT
ప్రపంచ టెస్ట్ క్రికెట్లో భార‌త్ స‌రికొత్త రికార్డులు
X
గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా నిర్దాక్షిణ్య‌మైన ఆట తీరుతో విరుచుకు ప‌డుతోన్న టీం ఇండియా తాజాగా స్వదేశంలో స‌ఫారీల‌తో జ‌రుగుతున్న టెస్ట్ సీరిస్‌ ను సొంతం చేసుకుని అరుదైన రికార్డుల త‌న ఖాతాలో వేసుకుంది. ఈ విజ‌యంతో స్వ‌దేశంలో త‌న ఆటకు తిరుగులేని మ‌రోసారి ఫ్రూవ్ చేసుకుంది. స‌ఫారీల‌తో పుణే వేదిక‌గా జ‌రుగుతోన్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా ఏ మాత్రం చేవ‌లేని బ్యాటింగ్‌ తో చేతులు ఎత్తేయ‌డంతో నాలుగో రోజే భార‌త్ విజ‌యం ఖాయ‌మైంది.

ఈ విజ‌యంతో భార‌త ట్టు ప్రపంచ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో కోహ్లి సేన మరింత పైపైకి దూసుకుపోయింది. అన్నింటికి మించి సొంతగడ్డపై వరుసగా 11 సిరీస్‌ విజయాలతో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. ఇక ఇప్ప‌ట‌కీ స్వ‌దేశంలో భార‌త జ‌ట్టుకు వ‌రుస‌గా 11వ టెస్ట్ విజ‌యం. ఇది కొత్త రికార్డు. గ‌తంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఆస్ట్రేలియా జ‌ట్టు రెండు సార్లు (1994–2001 - 2004–2008 మధ్య కాలంలో) వరుసగా 10 సిరీస్‌ లు గెలుచుకుంది.

ఇక భార‌త జ‌ట్టు టెస్ట్ మ్యాచ్‌ ల విజ‌యాల ప్ర‌స్థానానికి వ‌స్తే 2013 ఫిబ్రవరిలో ఆ్రస్టేలియాపై 4–0తో సిరీస్‌ గెలవడంతో భారత్‌ విజయప్రస్థానం మొదలైంది. భారత్‌ సొంతగడ్డపై చివరిసారిగా 2012లో ఇంగ్లండ్‌ చేతిలో టెస్టు సిరీస్‌ ఓడింది. అప్ప‌టి నుంచి అస‌లు ఇండియాకు సొంత గ‌డ్డ‌పై టెస్ట్ సీరిస్‌ లో ఓట‌మే అన్న‌దే లేదు. ఇక కోహ్లీ కెప్టెన్సీలో ఇది భార‌త జ‌ట్టుకు వ‌రుస‌గా 30వ విజ‌యం. కోహ్లీ కెప్టెన్‌ గా ఉన్న 30 టెస్టుల‌లో భార‌త జ‌ట్టు 10 విజ‌యాలు - 10 ఓట‌మిలు - 10 డ్రాల‌తో ఉంది.

ఇక ఐసీపీ ప్ర‌పంచ టెస్ట్ చాంపియ‌న్ షిఫ్‌ లో భాగంగా వెస్టిండిస్‌ తో జ‌రిగిన రెండు టెస్ట్‌ ల‌ను గెలుచుకోవ‌డం ద్వారా ఇప్ప‌టికే 120 పాయింట్లు త‌న ఖాతాలో వేసుకున్న ఇండియా తాజా సీరిస్‌ లో రెండు విజ‌యాల‌తో మ‌రో 80 పాయింట్లు క‌లుపుకుని... మొత్తం 200 పాయింట్ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌కు అంద‌నంత ఎత్తులో ఉంది. ఇక మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గా... ఇది కూడా గెలిస్తే అప్పుడు భార‌త్‌ కు మ‌రో 40 పాయింట్లు యాడ్ అవుతాయి.