మోడీ హయాంలో అవినీతి పెరిగిపోయిందంట!

Fri Feb 23 2018 12:48:40 GMT+0530 (IST)

యూపీఏ హయాంలో దేశంలో అవినీతి పెరిగిపోయిదంటూ అవాకులు చెవాకులు పేల్చిన కమలం...తాము అధికారంలోకి వస్తే అవినీతిపై యుద్ధం ప్రకటిస్తామంటూ ఆరంభ సూరత్వంలా ప్రగల్భాలు పలికింది. దానికి ప్రజలు మద్దతు పలకుతూ మోడీని నెత్తిన పెట్టుకున్నారు. తీరా చూస్తే ఏమైంది. ఏమైందో మీరే చూడండి. మోడీ హయాంలోనే ఎక్కువ అవినీతి జరిగిందంటూ  కరప్షన్ పెర్సెప్షన్ ఇండెక్స్  గొగ్గోలు పెడుతుంది.మనదేశం నుండి బ్రిటీష్ వారిని తరిమికొట్టినప్పటి నుండి ప్రభుత్వాన్ని ఏలే రాజకీయ నాయకులు అవినీతి నిర్మూలన గురించి బోలెడన్ని కబుర్లు చెప్పారు…కహానీలు వినిపించారు. మోడీ కూడా అదే సోది చెప్పి అధికారంలోకి వచ్చారు.

2014 ఎన్నికల్లో అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందంటూ యూపీఏని చెడుగుడు ఆడారు.  అవినీతి నిర్మూలన - నల్ల కుభేరుల భరతం పడతా - రాజకీయాల్ని మార్చేస్తా. దేశాన్ని ఎక్కడికో తీసుకెళతానంటూ  పేల్చిన పంచ్ డైలాగులకు ఓటర్లు ఆవేశపడిపోయి మోడీకి అధికారం వచ్చేలా  చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత చూస్తే గతంలో పోలిస్తే అవినీతి కంపు పెరిగిపోయిందని సర్వేలు చెబుతున్నాయి.  

ప్రతీసంవత్సరం ఆయా ప్రభుత్వాల పనితీరును బేరీజు వేసి పనితనంపై మార్కులు వేసే ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ..ఈ సారి కూడా  ర్యాంకులు ప్రకటించింది.

  'కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ పేరు ప్రపంచ వ్యాప్తంగా 180దేశాల్లో సర్వేలు నిర్వహించిన ఈ సంస్థ మనదేశంలో అవినీతి ఏ డిపార్ట్ మెంట్లలో ఎంత అవినీతి ఉంది..? ఎవరు ఎంతెంత తింటున్నారు..? అవినీతికి ఎదురొడ్డి పోరాడితే భారత్ కు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది. సగటు కన్నా తక్కువ వస్తే అవినీతి పేరుకుపోతున్న దేశాలుగా గుర్తించబడతాయనే విషయాల్ని కులంకషంగా చర్చించి సర్వేలను విడుదల చేసింది.

ఆ సర్వేల్లో అవినీతి పై మోడీ ప్రభుత్వం పోరాటం చేసిన భారత్ లో అవినీతి పేరుకుపోయిందని స్పష్టం చేసింది. అవినీతికి ఆటకట్టించడం సంగతి దేవుడు ఎరుగు..అవినీతి నిరోధంలో మాత్రం ఎక్కడవేసిన గొంగళి అన్న చందంగా ప్రపంచర్యాంకుల్లో 81వ స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 180దేశాలు 100 మార్కలపై సర్వే చేసిన సంస్థ భారత్ కు 40మార్కులేసింది. 2016లో  పోలిస్తే 2 ర్యాంకులు దిగజారింది.  11 సంస్థలు అవినీతిలో మునిగితేలుతున్నాయని తేల్చిన సంస్థ అవేంటో చెప్పకనే చెప్పేసింది.
 
పోలీస్ - న్యాయవ్యవస్థ - దర్యాప్తు సంస్థలు అవినీతి కోసం పోటీ పడుతున్నాయంటూ తెలిపింది. వాటిలో పోలీస్- న్యాయ వ్యవస్థలో 62శాతం -  భూలావాదేవీల్లో 38శాతం - వివిధ వాహనాల నుంచి వచ్చే ట్యాక్సుల్లో 61శాతం - 31శాతం మంది ఎంపీలు 78శాతం అవినీతికి పాల్పడుతున్నారని వెల్లడించింది. పేదలకు అందించే ఆహారంలో 40శాతం అవినీతి పాల్పడుతున్నారంటూ తేటతెల్లం చేసింది. ప్రతీ సంవత్సరం భారత్ లో 11సంస్థలు అవినీతికి పాల్పడుతుంటే వారి అవినీతి వాటా దాదాపు 32లక్షల కోట్లు ఉంటుందని అంచానా వేసింది. ఒకవేళ భారత్ లో అవినీతి పై పోరాటం చేస్తే ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలి దేశానికి నష్టం కలుగుతుందని  ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ప్రకటించింది.

 ఇక ఇతర దేశాల అవినీతి విషయానికొస్తే  పాకిస్థాన్ 32  - రష్యా 29 - భారత్ లో ఉన్న100 ఉప ఖండాలలో భూటాన్ 26 వ స్థానంలో మొదటిస్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్  28 - న్యూజిలాండ్ 89 - డెన్మార్క్  88  స్థానాలను దక్కించుకుంది. వెస్ట్రన్ యూరప్ 66 సగటు స్కోర్ తో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.

ఇదిలా ఉంటే మోడీ ప్రభుత్వాన్ని ట్రాన్సఫరెన్సీ ఇంటర్నేషనల్  సంస్థ హెచ్చరించే ప్రయత్నం చేసింది.  2014 లో జరిగిన ఎన్నికలలో బీజేపీ  అధికారంలోకి వచ్చిన ఆర్థిక సంస్కరణలతో పాటు అవినీతిపై సమరశంకం పూరిస్తామని ప్రకటించినా..అవి కార్యరూపం దాల్చలేదని 2019వరకు ఇలాగే కొనసాగితే అధికారంలోకి రావడం కష్టమని సూచించింది.