Begin typing your search above and press return to search.

పాక్ పద్దతులే కాదు సిగ్గూ వదిలేసింది!

By:  Tupaki Desk   |   28 Sep 2016 4:17 AM GMT
పాక్ పద్దతులే కాదు సిగ్గూ వదిలేసింది!
X
భారత్ విషయంలో పాక్ కు పద్దతులు ఉండవు - దొంగ దెబ్బతీయడంలో మరో ఆలోచనా ఉండదు - ఉగ్రవాదులను అప్రకటిత సైన్యంగా పెంచి పోషించడంలో మరో ఆలోచన లేదు... ఇవన్నీ సరే సిగ్గు కూడా ఉండదా? కొన్ని సందర్భాల్లో మతి కూడా సరిగా పనిచేయదా? సమాధానం లేనివాడే ఎదురుదాడి చేస్తాడనేది పాక్ విషయంలో పూర్తిగా వాస్తవమా? పాకిస్థాన్ రక్షణ శాఖా మంత్రి ఖవాజా అసిఫ్ మాటలు వింటే పై ప్రశ్నలన్నీ నిజమనిపిస్తుంది. ఎందుకంటే ఉరి ఉగ్రదాడి విషయంపై తాజాగా ఆయన మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి మరి.

ఉరిలో భారత్ సైనిక స్థావరంపై పాకిస్థానే దాడి చేయించిందనే ఆరోపణకు సంబందించి ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు లభించలేదని చెబుతున్నాడు పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా అసిఫ్. అక్కడితో ఆగితే పర్లేదు... "ఉరిలో సైకిక స్థావరంపై భారతే దాడి చేసుకున్నట్లు తెలుస్తుంది" అని వ్యాఖ్యానించారు. భారతే కావాలని దాడి చేసుకుని, పాక్ పై అనవసరంగా బురద జల్లుతుంది అనేది ఈయన గారి మాట. ఇంతకు మించిన నిస్సిగ్గు వ్యాఖ్య - ఇంతకు మించిన నిస్సిగ్గూ ఎదురుదాడి, ఇంతకు మించిన నిస్సిగ్గు సమర్ధన ఉండవేమో. అక్కడితో ఆగాడా అంటే అదీ లేదు... "కశ్మీర్‌ పరిష్కారానికి భారత్ తమలాగా చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు" అని నిస్సిగ్గు ఆరోపణ కూడా ఒకటి చేశాడు. నాలుకకి నరం ఉండదని తెలుసు కానీ.. మరీ ఈ స్థాయిలో మెలికలు తిరుగుతుందా? అనేది ఈ పాక్ మంత్రిగారిని చూస్తే అర్ధమవుతుంది.

కగా... ఉరీ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకరు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ కు చెందిన హఫీజ్‌గా గుర్తించిన నేపథ్యంలో... ఉగ్రవాదానికి మద్దతుకు పాక్‌ దూరంగా ఉండాలని భారత కోరుతోంది. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ మంత్రి భారత్ పైనే ఇలా ఎదురుదాడికి దిగారు.