Begin typing your search above and press return to search.

...ష్టడీ... మనది తొమ్మిదో స్థానం!

By:  Tupaki Desk   |   29 July 2015 7:16 AM GMT
...ష్టడీ... మనది తొమ్మిదో స్థానం!
X
భారతదేశంలో ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరు అబ్కారీ అనీ... భారతీయులు తెగ తాగేస్తున్నారని, తాగి చెడిపోతున్నారని, తాగుడులో రికార్డులు సృష్టించేస్తున్నారని తెగ చెబుతుంటారు కానీ... భారతీయులు ఏమంత గొప్ప తాగుబోతులు కాదంట! ఆ మాటకొస్తే మనోళ్లు తాగేది పెద్దగా లెక్కల్లోకి కూడా రాదట! కాకపోతే గుడ్డిలో మెల్లేంటంటే... ప్రపంచ వ్యాప్తంగా టాప్ 10లో మాత్రం స్థానం సంపాదించుకోగలిగారంతే!

విషయానికొస్తే... 2014లో ఎవరెంత ఆల్కహాల్ వాడారని విషయంపై లెక్కలు తీస్తే... అసలు భారతీయులు పెద్ద తాగుబోతులేమీ కాదని తేలిందట! ప్రపంచ లిక్కర్ మార్కెట్‌‌‌లో ఇండియాది పదికి ఒకటి తక్కువ స్థానమేనట. ఈ తాజా లెక్కల ప్రకారం... ప్రపంచ వ్యాప్తంగా మందుబాబులంతా కలిసి 2013లో 248 బిలియన్ల లీటర్ల ఆల్కహాల్ తాగితే... 2014కి వచ్చేసరికి సుమారు 249 బిలియన్ లీటర్ల ఆల్కహాల్ లాగించేశారట! అంటే 2013తో పోలిస్తే 1 బిలియన్ పెరిగిందనుకోండి! అయితే ప్రపంచ వ్యాప్తంగా లెక్కలు సరే కానీ... దేశాల వారీగా లెక్కలు కూడా తీశారట!

ఆల్కహాల్ వాడకంలో ప్రస్తుతానికి చైనా 27.5 శాతంతో ఫస్ట్ ప్లేస్ సంపాదించగా... 12.1 శాతం వాడకంతో అమెరికా రెండో స్థానాన్ని సంపాదించుకుందట! ఇదే క్రమంలో 5.7 శాతంతో బ్రెజిల్ మూడో స్థానంలో నిలవగా... మనం మాత్రం 9వ స్థానంలో ఉన్నామట! అయితే ఈ స్థాయి తాగుడు ఒక లెక్కకాదని, మరింత ముందుకు మద్యం వాడకం పెంచేందుకు ఆల్కహాల్ కంపెనీలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయట! ఏదిఏమైనా... భారతీయులు కాస్త లిమిట్ లోనే ఉంటున్నారన్నమాట!