Begin typing your search above and press return to search.

సర్జికల్ స్ట్రైక్స్ ఎలా జరిగిందంటే...?

By:  Tupaki Desk   |   29 Sep 2016 1:01 PM GMT
సర్జికల్ స్ట్రైక్స్ ఎలా జరిగిందంటే...?
X
ఉడీ ఉగ్రదాడికి గట్టి సమాధానం ఇచ్చింది ఇండియన్ ఆర్మీ. బాంబులు - యుద్దం - ప్రతీకారం అనే పదాలు ఏమీ వాడకుండా - సర్జికల్ స్ట్రైక్ అనే పదంతో పాక్ కు చుక్కలు చూపించింది. భారత్ - పాక్ మధ్య ఉన్న నియంత్రణ రేఖ వద్ద భారత బలగాలు చేపట్టిన ఈ సర్జికల్ దాడుల వివరాలను భారత సైన్యం అధికారికంగా చాలా స్పష్టంగా వివరించింది. అర్థరాత్రి 12:30గంటల ప్రాంతంలో మొదలైన ఈ ఆపరేషన్ తెల్లవారు జామున 4:30గంటల ప్రాంతంలో ముగిసినట్లు వివరించిన భారత సైన్యం.. పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఏడు ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. ఉడి ఉగ్రవాద దాడి లో 18మంది భారతీయ జవాన్లకు బలిగొన్న ఉగ్రవాదులను సుమారు రెంట్టింపు నుంచి మూడింతలమందిని మట్టుబెట్టినట్లు కథనాలు వెలువడుతున్నాయి.

ఈ దాడి అనంతరం ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ - పాకిస్థాన్ కు ఈ విషయం చేరవేశారు. అనంతరం ప్రత్యేక మీడియా సమావేశం పెట్టి తాము దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పడంతోపాటు - జరిపిన విదానంపై కూడా ఆర్మీ తరుపున ముఖ్యమంత్రులకు - నేతలకు చెప్పారు. సైన్యం చెప్పిన వివరాల ప్రకారం సైన్యం ఈ ఆపరేషన్ ను ఎలా మొదలు పెట్టింది, ఎలా ముగించింది అనే వివరాలు ఇలా ఉన్నాయి!

ఉడీ ఉగ్రదాడి చేసేముందు ఉగ్రవాదులు పెద్దపెద్ద కొండ ప్రాంతాల నుంచి రెక్కీ నిర్వహించినట్లు తెలుసుకున్న ఇండియన్ ఆర్మీ... ఉడీ ఉగ్రదాడిలో నలుగురు ఉగ్రవాదులే హతమవడంతో మరింత మంది ఉగ్రవాదులు అదే కొండప్రాంతాల సమీపంలో ఉన్నట్లు సమాచారం అందుకున్నారు. దీంతో దీంతో వారం రోజుల నుంచి భారత సైన్యం ప్రణాళిక సిద్ధం చేసి నిఘా ప్రారంభించింది. ఈ సమయంలో ఉడీ ఉగ్రదాడి మాదిరిగానే వారు మరోసారి ఏక్షణంలో అయినా దాడి చేయొచ్చని నిఘా సమాచారం అందడంతో... వారి కంటే ముందు తామే బదులు చెప్పాలని నిర్ణయించుకుంది భారత సైన్యం. దీంతో నియంత్రణ రేఖను తొలిసారి దాటి పాకిస్థాన్ భూభాగం వైపు 500 మీటర్ల - 2.50 కిలోమీటర్ల ముందుకు కదిలిన భారత సైన్యం ఎనిమిది స్థావరాలపై దాడి చేశాయి.

ఈ ఆపరేషన్‌ నిర్వహించేందుకు భారత ఆర్మీ పారాకమాండోస్‌ - హెలికాప్టర్లను ఉపయోగించారు. ఎంపిక చేసుకున్న బలగాలను ఈ హెలికాప్టర్ల ద్వారా అనుమానిత ప్రాంతంలోకి దించిన అనంతరం ఒక్కసారిగా అనూహ్యంగా భారత్ సైన్యం సర్జికల్ ఆపరేషన్ నిర్వహించి ఉగ్రవాద శిబిరాలపై విరుచుకు పడింది. ఈ దాడిలో సుమారు 35 - 40 మంది ఉగ్రవాదులు హతమవగా - మరికొందరు బందీలుగా చిక్కారు. ఈ సమయంలో ఉగ్రవాద స్థావరాల్లో లభించిన ఆయుధాలు అన్నీ పాక్ కు చెందినవని గుర్తించిన ఆర్మీ - ఈ దాడిలో హతమైనవారు కూడా పాక్ ప్రాంతానికి చెందినవారని తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/