Begin typing your search above and press return to search.

అత్య‌ధిక జ‌నాభా ఉన్న దేశం చైనా కాదు

By:  Tupaki Desk   |   25 May 2017 2:29 PM GMT
అత్య‌ధిక జ‌నాభా ఉన్న దేశం చైనా కాదు
X
సుదీర్ఘ‌కాలంగా పుస్త‌కాల్లో, మ‌న మెద‌ళ్ల‌లో నాటుకుపోయిన ఓ విష‌యం ఏంటంటే.. ప్ర‌పంచంలో అత్య‌ధిక జ‌నాభా ఉన్న దేశం చైనా అని. కానీ ఇప్పుడు పుస్త‌కాలే కాదు.. మ‌న మెద‌ళ్ల‌లోని ఆ నిజాన్ని కూడా మార్చుకోవాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది. అమెరికాలోని ఓ యూనివ‌ర్సిటీ తాజా అధ్య‌య‌నం తేల్చిన విష‌యం ఏంటంటే.. అత్య‌ధిక జ‌నాభా ఉన్న దేశం చైనా కాదు.. ఇండియానే అని. 1990 నుంచి చైనా త‌న జ‌నాభాను ఉన్న‌దాని కంటే ఎక్కువ‌గా చేసి చెబుతున్న‌ద‌ట‌.

చైనా తమ దేశంలో ఉన్న జ‌నాభా కంటే 9 కోట్లు ఎక్కువ చేసి చూపిస్తున్న‌ద‌ని విస్‌ కాన్సిన్‌-మాడిస‌న్ యూనివ‌ర్సిటీకి చెందిన రీసెర్చ‌ర్ యి ఫుక్సియాన్ వెల్ల‌డించారు. అంటే ఈ లెక్క ప్ర‌కారం చైనా డేంజ‌ర్‌ లో ఉన్న‌ట్లే. ఆ దేశంలో ప‌నిచేసే వ‌యసు ఉన్న వారి సంఖ్య రోజురోజుకూ త‌గ్గిపోతున్న‌ది. ఇప్పుడు ఆ దేశం చెబుతున్న‌ట్లు జ‌న‌నాల సంఖ్య ఆ స్థాయిలో లేక‌పోతే ప‌నిచేసే వారి సంఖ్య త‌గ్గిన‌ట్లే. యీ ఫుక్సియాన్‌ అధ్య‌య‌నం ప్ర‌కారం 1990 నుంచి 2016 వ‌ర‌కు చైనాలో జ‌న‌నాల సంఖ్య‌.. 37.76 కోట్లు. అయితే చైనా మాత్రం ఈ సంఖ్యను 46.48 కోట్లుగా చూపిస్తున్న‌ది.ముఖ్యంగా ఒక‌రే బిడ్డ అన్న విధానం తీసుకొచ్చిన‌ప్ప‌టి నుంచి చైనాలో జ‌నాభా గ‌ణ‌నీయంగా త‌గ్గింది. ఈ లెక్క ప్ర‌కారం 2016 చివ‌రికి చైనా మొత్తం జ‌నాభా 129 కోట్లే అవుతుంది. ఆ లెక్క‌న 133 కోట్లు ఉన్న భార‌త్ ప్ర‌పంచంలో అత్య‌ధిక జ‌నాభా ఉన్న దేశంగా నిలుస్తుంద‌ని ఈ అధ్య‌య‌నం స్ప‌ష్టంచేసింది. ఈ యూనివర్సిటీలోని మిగతా రీసెర్చ‌ర్లు కూడా యీ ఫుక్సియాన్ లెక్క‌ల‌ను స‌మ‌ర్థిస్తున్నారు. అందువ‌ల్ల చైనాలో ప్ర‌స్తుతం ఉన్న జ‌నాభా నియంత్ర‌ణ‌ను కూడా ఎత్తేయాల‌ని వాళ్లు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/