మదర్ బాంబ్ తాత మన దగ్గర ఉంది తెలుసా

Fri Apr 21 2017 22:18:23 GMT+0530 (IST)

మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్ బాంబ్(ఎంఓఏబీ) ఈ పదం ఇటీవల చాలా పాపులర్ అయింది. ఎందుకంటే ఆప్ఘనిస్తాన్ లోని ఐసిస్ స్థావరంపై  అమెరికా ప్రయోగించగా దాదాపు 100 మంది తీవ్రవాదులు హతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ బాంబు సంచలనం సృష్టించింది. రేడియేషన్ కలిగించే ఈ బాంబును మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ పేరుతో పలుకుతున్నారు. అయితే అగ్రరాజ్యం అమెరికా కంటే తోపు బాంబు ఎవరి వద్ద ఉందంటే....మన దేశం దగ్గరే. నిజంగా నిజం.

సంప్రదాయ పేలుడు పదార్ధాల కంటే 15 రెట్లు ఇది శక్తిమంతమైన బాంబును ఆరేళ్ల కిందటే డీఆర్ డీవో  అభివృద్ధి చేసింది. సీఎల్-20 పేరు కలిగిన ఈ బాంబు రేడియేషన్ కలిగించని శక్తిమంతమైన బాంబు కావడం విశేషం. అయితే ఈ బాంబ్‌ను ఏ విధంగా ప్రయోగిస్తారనే విషయం మాత్రం డీఆర్ డీవో వెల్లడించడం లేదు. ఇదిలాఉండగా ఇంకో దుమ్మురేపే బాంబ్ కూడా మన దేశం దగ్గర ఉంది. అదే సింపుల్‌గా స్పైస్..పూర్తి పేరు  స్మార్ట్ ప్రిసైజ్ ఇంపాక్ట్ అండ్ కాస్ట్ ఎఫెక్టీవ్(ఎస్ పీఐసీఈ). ఉగ్ర స్ధావరాల నేలమట్టం చేయాలనుకున్న సమయంలో దీన్ని మనదేశం ఉపయోగించుకునే అవకాశం ఉంది. స్పైస్ ను ప్రయోగించేందుకు కార్గో విమానాల వంటివి అవసరం లేదు. జెట్ విమానాలు అయిన సుఖోయ్ - మిరాజ్ 2000 వంటివాటి  నుంచి కూడా లక్ష్యంపై దాడి చేయవచ్చు. స్పైస్ బరువు కేవలం 1000 కేజీలు కాగా దీన్ని అభివృద్ధి చేసింది ఇజ్రాయెల్ కు చెందిన రాఫెల్ అడ్వాన్స్ డ్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. కాగా ఇటీవల మన సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ వంటి వాటిలో ఎయిర్ ఫోర్స్ ప్రధాన ఎంపిక స్పైస్ కావడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/