Begin typing your search above and press return to search.

ఆశ్చ‌ర్యం: రాత్రి వేళ మెరుస్తున్న ఇండో-పాక్ బోర్డ‌ర్‌

By:  Tupaki Desk   |   6 Oct 2015 3:49 PM GMT
ఆశ్చ‌ర్యం: రాత్రి వేళ మెరుస్తున్న ఇండో-పాక్ బోర్డ‌ర్‌
X
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఆదివారం తన ఫేస్‌ బుక్ పేజ్‌లో భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు ఫొటోలను పోస్ట్ చేసింది. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌ లో ఉన్న ఓ వ్యోమగామి భారత్, పాక్ సరిహద్దులతో పాటు కరాచీ, ఇండస్ నదీ ప్రాంతం, హిమాలయాలను చూపుతూ ఈ చిత్రాన్ని తీశాడు. ఈ ఫొటోల‌ను మంగ‌ళ‌వారం నాసా రిలీజ్ చేసింది. రోద‌సిలో ఉన్న ఓ అంత‌ర్జాతీయ అంత‌రిక్ష వ్యోమ‌గామి ఈ ఫోటోను సెప్టెంబర్ 23వ తేదీన 28 మిల్లిమీటర్ల లెన్స్ కలిగిన నికాన్ డీ4 డిజిటల్ కెమెరా సాయంతో బంధించాడు. ఈ ఫోటోలో భారత్, పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు విద్యుద్దీప కాంతులతో ధ‌గ‌ధ‌గ మెరిసిపోతూ క‌నిపిస్తోంది.

రాత్రి వేళ‌ల్లో భూమి మీద అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అలాగే నారింజ రంగుల‌తో మెరుస్తున్న భ‌ద్ర‌తా లైట్లు భారత్‌-పాకిస్తాన్ స‌రిహ‌ద్దును వేరు చేస్తున్న‌ట్టు స్ప‌ష్టంగా చూపిస్తున్నాయి. తాజాగా విడుద‌ల చేసిన ఫొటోలో ఉత్త‌ర పాకిస్తాన్‌లోని ఇండ‌ర్ రివ‌ర్ వ్యాలీమీదుగా ఉన్న ప్రాంతం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. గ‌తంలోను 2011లో భారత్‌-పాకిస్తాన్ స‌రిహ‌ద్దుకు సంబంధించిన ఫొటోను నాసా విడుద‌ల చేసింది. అయితే ఆ ఫొటో కంటే తాజాగా రిలీజ్ చేసిన ఫొటో స‌రికొత్త‌గా..అబ్బుర ప‌రిచేలా ఉంది.

భార‌త్‌-పాకిస్తాన్ స‌రిహ‌ద్దు అంటేనే ఎప్పుడూ చొర‌బాట్లు, రాత్రివేళ‌ల్లో కాల్పుల మోత‌లు ధ్వ‌నిస్తుంటాయి. అయితే ఇటీవ‌ల కాలంలో ఇరు దేశాలు భద్రతాపరంగా గట్టి చ‌ర్య‌లు తీసుకోవడంతో స‌రిహ‌ద్దు ప్రశాంతంగా నిద్ర‌పోతున్న‌ట్టుగా ఆ ఫొటోలో క‌నిపిస్తోంది. ఈ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఇండియా వ్యాప్తంగా జోరుగా హ‌ల్ చ‌ల్ చేస్తోంది.