Begin typing your search above and press return to search.

భార‌త్ పంచ్‌ కు అమెరికా మైండ్ బ్లాంక్‌

By:  Tupaki Desk   |   17 Jun 2018 4:35 AM GMT
భార‌త్ పంచ్‌ కు అమెరికా మైండ్ బ్లాంక్‌
X
ఇటీవ‌లి కాలంలో టార్గెట్ ఇండియా అన్న‌ట్లుగా నిర్ణ‌యాలు తీసుకుంటున్న ట్రంప్ స‌ర్కారుకు మైండ్ బ్లాంక్ అయ్యే ఎదురుదాడి జ‌రిగింది. అగ్రరాజ్యం అమెరికా – చైనా దేశాల మధ్య మొద‌లైన వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. వివిధ రకాల వస్తువులపై సుంకాలను రెండు దేశాలు పెంచుకుంటూ పోతున్న సంగ‌తి తెలిసిందే. చైనా నుంచి దిగుమతి అయ్యే 50 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులపై 25శాతం సుంకం విధిస్తున్నట్లు శుక్రవారం(జూన్-15) అమెరికా ప్రకటించిన కొన్ని గంటల్లోనే అదే మొత్తానికి సమానమైన 659 అమెరికా ఉత్పత్తులపై సుంకాన్ని విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. అమెరికా కంటే ఓ అడుగు ముందుకేసిన చైనా.. 545 వస్తువులపై జులై 6 - 2018 నుంచి ఈ అదనపు సుంకాన్ని వసూలు చేస్తామని చైనా కస్టమ్స్‌ టారిఫ్స్‌ కమిషన్‌ తెలిపింది. మిగిలిన 114 ఉత్పత్తులపై విధించిన సుంకాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది.

ఇలా అమెరికా – చైనా మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తున్న టైంలోనే.. ఈ వివాదంలోకి భారత్ ను లాగింది అమెరికా. భారత్ ఎగుమతి చేస్తున్న వస్తువులపై అమెరికా సుంకాలను పెంచింది. అమెరికా నిర్ణయాన్ని సవాల్ చేస్తున్నట్లు ఇండియాకూ సంచలన నిర్ణయం తీసుకున్నది. అదే స్ధాయిలో అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న 30 రకాల ఉత్పత్తులపై సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించి అమెరికాకు షాక్ ఇచ్చింది. 30 రకాల ఉత్పత్తులపై 50 శాతం కస్టమ్స్‌ డ్యూటీని పెంచే ప్రతిపాదనను వ‌రల్డ్‌ ట్రేడ్ ఆర్గనైజేన్ కు భారత్ తెలిపింది. భారత్ నిర్ణయంతో అమెరికాకు పెద్ద ఝలక్ తగిలిందనే చెప్పవచ్చు.

మ‌రోవైపు జీ7 దేశాల రూపంలో అమెరికాకు ఒత్తిడి ఎదుర‌వుతున్న సంగ‌తి తెలిసిందే. జీ7 శిఖరాగ్ర సమావేశం అమెరికా - కెనడా మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. తన వాణిజ్య విధానాలను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తప్పుపట్టడంతో జీ7 సం యుక్త ప్రకటన నుంచి అమెరికా తప్పుకుంది. దీంతో అసంతృప్తిగానే సమావేశాలు ముగిశాయి. దీని ప్రభావం ఇరు దేశాల సంబంధాలపైనా పడనున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా వాణిజ్య విధానాలను ట్రూడో బహిరంగం గా వ్యతిరేకించారు. ఈయూ - కెనడా - మెక్సికోల నుంచి ఉక్కు - అల్యూమినియం దిగుమతిపై సుంకాలు విధిస్తూ ఇటీవ ల ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రూడో వ్యతిరేకించారు. కెనడా ప్రజలు మర్యాదపూర్వకంగా ఉంటారని.. ఎవరైనా ఇబ్బంది పెడితే మాత్రం సహించబోరని ట్రూడో మీడియాకు తెలిపారు. దీంతో టూడో వైఖరిపై మండిపడిన ట్రంప్.. జీ7 సదస్సు సంయుక్త ప్రకటనకు మద్దతు ఉపసంహరించుకోవాలని తన అధికారులను ఆదివారం ఆదేశించారు. ఇలా అన్నివైపులా అమెరికా తీరును ఆయా దేశాలు త‌ప్పుప‌డుతుండ‌టం గ‌మ‌నార్హం.