Begin typing your search above and press return to search.

రివర్స్‌ చేసి వారిని చిక్కుల్లో పడేసిన సూపర్ స్టార్

By:  Tupaki Desk   |   20 April 2019 9:14 AM GMT
రివర్స్‌ చేసి వారిని చిక్కుల్లో పడేసిన సూపర్ స్టార్
X
దేశ వ్యాప్తంగా పార్లమెంటుకు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెల్సిందే. ఈనెల 18వ తారీకున రెండవ దశ ఎన్నికల్లో భాగంగా తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాలకు ఎన్నిక జరిగింది. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో సినీ ప్రముఖులు పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్న విషయం తెల్సిందే. రజినీకాంత్‌ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడ వరకు బాగానే ఉంది కాని, ఆయన ఓటు హక్కును వినియోగించుకునే సమయంలో ఎడమ చేతి వేలిపై కాకుండా కుడి చేతి వేలిపై చిరా రాయించుకున్నారు.

రూల్స్‌ ప్రకారం ఎడమ చేయి చూపుడు వేలుకు సిరా రాయాల్సి ఉంటుంది. అది సాధ్యం కాకుంటే ఎడమ చేతికి ఉన్న ఏదో ఒక వేలికి అయినా రాయవచ్చు. కాని రజినీకాంత్‌ కు మాత్రం ఎన్నికల అధికారులు కుడి చేతితి ఉన్న చూపులు వేలుకు సిరా రాయడం జరిగింది. సూపర్‌ స్టార్‌ వచ్చిన ఆనందంలో వారు ఆయన ఏ చేయిని అందించారు, తాము ఏ చేతి వేలికి సిరా పెడుతున్నామనే విషయాన్ని పట్టించుకోలేదు. పొరపాటున రజినీకాంత్‌ కుడి చేయిని చాచడంతో అధికారులు ఇంకును అదే చేతికి రాసి చిక్కుల్లో పడ్డారు.

ఓటు వేసిన తర్వాత రజినీకాంత్‌ తన వేలికి ఉన్న సిరాను చూపుతు ఫొటోలకు ఫోజ్‌ లు ఇచ్చాడు. అందులో కుడి చేతి వేలికి సిరా ఉండటంతో విమర్శలు వ్యక్తం అయ్యాయి. రాష్ట్ర ఎన్నికల అధికారి సైతం ఈ విషయంలో తప్పు జరిగిందని ఒప్పుకున్నాడు. రజినీకాంత్‌ ఓటు వేసిన చెన్నై స్టెల్లా మేరీ కాలేజ్‌ లో ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులను ప్రశ్నించారు. ఈ తప్పిదంపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించారు. సెలబ్రెటీని చూసి డ్యూటీ మర్చి పోయారు అంటూ సోషల్‌ మీడియాలో ఎన్నికల అధికారులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.