Begin typing your search above and press return to search.

గుడ్ న్యూస్: 5 ల‌క్ష‌ల దాకా ఐటీ లేదు!

By:  Tupaki Desk   |   17 Jan 2019 5:15 AM GMT
గుడ్ న్యూస్: 5 ల‌క్ష‌ల దాకా ఐటీ లేదు!
X
ఎన్నిక‌లు సామాన్యుడికి మేలు చేస్తున్నాయి!. రాజ‌కీయ నాయ‌కులు ప్ర‌జ‌ల కోసం ఆలోచించే అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్నాయి!! వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా రెండోసారి అధికారపగ్గాలు చేపట్టాలన్న `కసి`తో ఉన్న బీజేపీ తన అమ్ములపొదిలో నుంచి మరో అస్ర్తాన్ని తీయ‌నుంద‌ని వార్త‌లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్నాయి. ఉద్యోగులు - మధ్యతరగతి ప్రజల్ని ఆకర్షించేందుకు డబుల్ బొనాంజా ప్రకటించనుంద‌ని తెలుస్తోంది. ప్రస్తుతం ఏటా రూ.2.5 లక్షలు ఉన్న ఆదాయం పన్ను (ఐటీ) మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచనున్నట్లు సమాచారం.

2018లో పూర్తిస్థాయి బడ్జెట్‌ ను ప్రవేశపెడుతున్నప్పుడు ఉద్యోగులు - మధ్య తరగతి ప్రజలపై జైట్లీ ఏ వరాల జల్లు కురిపించలేదు. రవాణా - వైద్యం ఖర్చుల్లో రూ.40వేల వరకు మినహాయింపు నిచ్చారు. 2017లో కింది శ్ల్లాబ్‌ లో పన్ను రేటును మాత్రం తగ్గించారు. అప్పటివరకు రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల శ్లాబ్‌కు 10% పన్ను ఉండగా - దాన్ని ఐదు శాతానికి తగ్గించారు. రూ.2.5 లక్షల లోపు వార్షికాదాయం గల వారికి ఐటీ నుంచి మినహాయింపునిచ్చారు. ప్రస్తుతం రూ.5లక్షల నుంచి రూ.10లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి 20% - రూ.10 లక్షల వార్షిక ఆదాయం దాటిన వారికి 30% పన్ను విధిస్తున్నారు. ఐటీ మినహాయింపుపై కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ లో ప్రకటించే అవకాశం ఉందని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ లో ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది.