Begin typing your search above and press return to search.

ఆ స్కాంలో బీజేపీ ఎంపీగారి అమ్మాయి

By:  Tupaki Desk   |   17 July 2018 7:52 AM GMT
ఆ స్కాంలో బీజేపీ ఎంపీగారి అమ్మాయి
X
జాతీయ‌త పేరుతో నిత్యం దేశ‌భ‌క్తిని మాట‌ల్లో ఉప్పొంగేలా చేసే బీజేపీ నేత‌లు సైతం మిగిలిన రాజ‌కీయ పార్టీల‌కు తీసిపోరని.. అవినీతి కుంభ‌కోణాల్లో వారి పాత్ర ఉంటుంద‌న్న విష‌యం అప్పుడ‌ప్పుడు వెలుగు చూస్తున్న విష‌యాల‌తో అర్థ‌మ‌వుతోంది. బీజేపీ ఏమీ సుద్ద‌పూస కాద‌ని.. నీతికి.. నిజాయితీకి మారుపేరు ఎంత‌మాత్రం కాద‌న్న వైనం కొన్ని ఉదంతాలు చూస్తే అర్థంకాక మాన‌దు. తాజాగా అసోం రాష్ట్రంలో వెలుగు చూసిన ఉద్యోగాల స్కాంలో బీజేపీ ఎంపీగారి అమ్మాయి పాత్ర ఉంద‌ని తేలింది.

అసోం ప‌బ్లిక్ స‌ర్వీసు క‌మిష‌న్ నిర్వ‌హించిన హ్యాండ్ రైటింగ్ ప‌రీక్ష‌లో బీజేపీ ఎంపీ ఆర్పీ శ‌ర్మ కుమార్తె ప‌ల్ల‌వి శ‌ర్మ అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిన‌ట్లుగా తేల్చారు. అక్ర‌మ‌ప‌ద్ధ‌తిలో పోలీసు అధికారిణిగా ఎంపికైన ప‌ల్ల‌వి శ‌ర్మ‌తో పాటు 19 మందికి పోలీసులు స‌మ‌న్లు జారీ చేశారు.

డ‌బ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చే భాగోతంలో సాక్షాత్తూ అసోం ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ మాజీ ఛైర్మ‌న్ రాకేష్ పాలో హ్యాండ్ ఉంద‌న్న విష‌యం తేల‌గా.. తాజాగా అధికార బీజేపీ ఎంపీగారి అమ్మాయి అక్ర‌మ ప‌ద్ద‌తిలో ఉద్యోగాన్ని సాధించిన వైనం బ‌య‌ట‌కు వ‌చ్చి సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

2016 జులై 18న గౌహ‌తి పోలీసు స్పెష‌ల్ బ్యూరో హెడ్ క్వార్ట‌ర్స్ లో అభ్య‌ర్థుల‌కు హ్యాండ్ రైటింగ్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. అయితే.. ఈ ప‌రీక్ష‌కు ముందే మ‌రో ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. ఈ రెండింటి పత్రాల్ని ప‌రిశీలించిన‌ప్పుడు అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వైనాన్ని గుర్తించారు. తాను చేసే దొంగ ప‌నుల కార‌ణంగా తండ్రికి ఉన్న హోదా.. ప‌లుకుబ‌డి మొత్తం నాశ‌న‌మ‌వుతుంద‌న్న చిన్న విష‌యం ఎంపీగారి అమ్మాయికి ఎందుకు త‌ట్ట‌లేదంటారు?