Begin typing your search above and press return to search.

9 భాషల్లో మాట్లాడి ట్రంప్ ను ఆశ్చర్యపర్చిన మోడీ

By:  Tupaki Desk   |   23 Sep 2019 4:35 AM GMT
9 భాషల్లో మాట్లాడి ట్రంప్ ను ఆశ్చర్యపర్చిన మోడీ
X
సర్ ప్రైజ్ లు ఇవ్వటం ప్రధాని నరేంద్ర మోడీకి అలవాటే. అయితే.. ఈసారి ఆయన తన ప్రావీణ్యంతో అగ్రరాజ్య అధినేతను ఆశ్చర్యచకితులు అయ్యేలా చేశారు. తన భాషా ప్రావీణ్యాన్ని ప్రదర్శించి ఆయన సర్ ప్రైజ్ అయ్యేలా చేశారు. పలికింది చిన్న పదాలే అయినా.. ఔరా.. మోడీలో ఇంత టాలెంట్ ఉందా? అన్నట్లుగా ఆయన ఆశ్చర్యపోయేలా చేశారు మోడీ.

హోడీ మోడీ మెగా ఈవెంట్ అనుకున్నట్లే భారీగా.. ఫుల్ జోష్ తో సాగటమే కాదు.. తన మాటలతో ట్రంప్ మనసును దోచేలా చేశారు మోడీ. ఈ మెగా ఈవెంట్ కు ముందుగా అనుకున్నట్లే ట్రంప్ హాజరు కావటంతో కొత్త కళ సంతరించుకుంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి అమెరికాను పర్యటించిన మోడీకి.. ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఇక.. అమెరికా అధ్యక్షుడి సమక్షంలో మోడీ తన టాలెంట్ ను ప్రదర్శించారు.

50వేల మందికి పైనే పాల్గొన్న హుస్టన్ లోని ఎన్ ఆర్జీ స్టేడియంలో కిక్కిరిసన జన సందోహం మధ్య మోడీ మాట్లాడారు. అంతా బాగుంది అనే పదాన్ని హిందీ.. గుజరాతీ.. మరాఠీ.. బెంగాలీ.. తెలుగు.. కన్నడ.. తమిళంతో పాటు మరో భాషలో పలికారు. తాను మాట్లాడిన అన్ని భాషల్లో తానేం చెప్పానో ట్రంప్ నకు మోడీ వివరించారు. దీంతో.. అక్కడున్న వారంతా చిరునవ్వులు చిందించారు.

భారత దేశంలో ఎన్నో భాషలు.. మరెన్నోయాసలు ఉన్న విషయంతో పాటు.. భిన్నత్వంలో ఏకత్వం ఉన్నాయని.. భిన్న ఆచార సంప్రదాయాలు.. వేష భాషలు.. వాతావరణాలు ఉన్నట్లుగా చెప్పిన ఆయన.. భారత్ అద్భుతంగా చెప్పారు. భారత్ మాత్రమే కాదు.. భారత్ ను పాలిస్తున్న మోడీ కూడా అద్భుతమే అన్నట్లుగా ట్రంప్ రియాక్షన్ ఉండటం గమనార్హం. తొమ్మిది భాషల్లో మోడీ మాట్లాడిన తీరుకు ట్రంప్ అచ్చెరువువొందినట్లుగా ఎక్స్ ప్రెషన్లు ఇచ్చారు.

వీడియో కోసం క్లిక్ చేయండి