వైజాగ్ బీచ్ గెస్ట్ హౌస్ లో అలా జరిగిపోతుందా?

Thu Sep 12 2019 07:00:01 GMT+0530 (IST)

ఉక్కునగరంగా పేరున్న విశాఖపట్టణంలో వినోదాలకు కొదవలేదు. రుచికరమైన ఫుడ్ తో పాటు.. కోరుకున్న సౌకర్యాలు బోలెడన్ని. దీనికి తోడు అందమైన సముద్రతీరం ఉన్న ఈ నగరం ఎప్పుడూ యూత్ ఫుల్ గా.. రొమాంటిక్ గా ఉంటుందన్న పేరుంది. అలాంటి ఈ బీచ్ సిటీలోని ఒక గెస్ట్ హౌస్ వ్యవహారం స్థానిక అధికార వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి విశాఖ బీచ్ తీరంలో ఒక అందమైన గెస్ట్ హౌస్ ఉంది. దీన్ని ఆయన లీజుకు ఇచ్చినట్లు చెబుతున్నారు. అధికారం.. పలుకుబడి ఉన్న అధికారిది గెస్ట్ హౌస్ కావటంతో.. అందులో ఏం చేసినా నడిచిపోతుందన్నట్లుగా ఉందంటున్నారు. ఈ గెస్ట్ హౌస్ లో వ్యభిచారం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతుందంటున్నారు.

తాజాగా వైజాగ్ లోని పలు గెస్ట్ హౌస్ లు.. హోటళ్లను తనిఖీ చేసే క్రమంలో.. ఈ గెస్ట్ హౌస్ వ్యవహారం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ గెస్ట్ హౌస్ యజమాని ఎవరన్న విషయం ఆరా తీసిన పోలీసులకు.. సదరు గెస్ట్ హౌస్ ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిదన్న సమాచారం అందటంతో వారు.. ఆ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడినట్లుగా చెబుతున్నారు.

అయితే.. సదరు గెస్ట్ హౌస్.. యాజమాన్య హక్కులు సదరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పేరు మీద కాకుండా.. వేరే వారి పేరున ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారం ఇప్పుడు స్థానిక అధికారుల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.