Begin typing your search above and press return to search.

చంద్రబాబుది ఏబీసీడీ పాలన!

By:  Tupaki Desk   |   25 Oct 2016 6:44 AM GMT
చంద్రబాబుది ఏబీసీడీ పాలన!
X
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఏబీసీడీ పాలన కొనసాగిస్తున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఐవి రెడ్డి అన్నారు. చంద్రబాబునాయుడు దుర్మార్గమైన పాలన కొనసాగిస్తూ ప్రజలను వంచిస్తున్నాడని ఆరోపించిన ఐవిరెడ్డి - ‘ఏబీసీడీ పాలన అంటే ఏమిటో ఆయన ఓ విలక్షణమైన వివరణ ఇచ్చారు. ఆయన వివరణలోనే.. ఏబీసీడీ నిర్వచనం తెలుసుకోవాలంటే...

‘‘ఏ అంటే యాక్టింగ్.. జనం ముందు వారికోసం పాటుపడుతున్నట్లుగా నటించడం, బీ అంటే బీటింగ్.. ప్రభుత్వం చేసే తప్పులను ఎవరు ప్రశ్నించినా సరే.. పోలీసుల లాఠీచార్జీలతో వారిని కొట్టించడం - సీ అంటే చీటింగ్.. జనాన్ని కల్లబొల్లి కబుర్లు - దారుణమైన వాగ్దానాలతో మోసం చేయడం - డీ అంటే డీలింగ్.. పరిశ్రమల పేరు చెప్పి వచ్చే పారిశ్రామిక వేత్తలతో లోపాయికారీ డీల్స్ కుదుర్చుకుని ఆ డీల్స్ ప్రకారం లక్షల కోట్ల రూపాయలు దండుకోవడం’’ అని ఐవిరెడ్డి అన్నారు.

కనీసం రాష్ట్రంలో యువతరానికి ఉపాధి అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా తేగల ప్రత్యేకహోదా హామీని ఎన్నికలకు ముందు ఇచ్చి, ఇప్పుడు వంచించిన చంద్రబాబునాయుడు సర్కారును ఆయన దెప్పి పొడిచారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్మోహనరెడ్డి సారథ్యంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ సాగించే అలుపెరగని, మడమ తిప్పని పోరాటానికి ప్రజలందరూ కూడా సహకరించాలని ఆయన పిలుపు ఇచ్చారు. ప్రజలు మద్దతు తోడై - ఈ పోరాటం ఉద్యమ రూపం దాల్చిందంటే.. హోదా తప్పక వచ్చితీరుతుందని ఐవి రెడ్డి చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/