ఐటీలో 6 లక్షల ఉద్యోగాలు హాంఫట్?

Mon May 15 2017 13:03:43 GMT+0530 (IST)

ఐటీ సెక్టారు ప్రమాదం అంచుల్లో ఉంది. రెండు మూడేళ్లలో సుమారు 6 లక్షల మంది ఉద్యోగులకు ప్రమాదం పొంచి ఉందని వారిలో చాలా మంది సీనియర్ ఐటి నిపుణులకు చిక్కలు తప్పేట్లు లేవని హెడ్ హంటర్స్ చైర్మన్ లక్ష్మికాంత్ చేసిన వ్యాఖ్యలు ఐటీ ఉద్యోగులను భయపెడుతున్నాయి. ప్రస్తుతం ఐటి రంగంలో ఏర్పడ్డ డిజిటల్ సునామీలో చాలా మంది కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఐటి రంగంలో సుమారు 40 లక్షల మంది పనిచేస్తున్నారని వారిలో 24 లక్షల మందికి తిరిగి శిక్షణ ఇవ్వవచ్చునని అయితే దానికి కూడా పరిమితులున్నాయని లక్ష్మికాంత్ అంటున్నారు.

మొత్తం 24 లక్షల మందిలో సుమారు 50 శాతం లేదా 12 లక్షల మందికి శిక్షణ ఇవ్వవచ్చు. మరో 6 లక్షల మంది ఏదో విధంగా ప్రస్తుతం ఉన్న నైపుణ్యం ద్వారా సర్దుబాటు చేసినా మిగిలిన 6 లక్షల మందికి మాత్రం ప్రమాదం పొంచి ఉందని వచ్చే మూడేళ్లలో వారు ఉద్యోగాలు కోల్పోవాల్సిన రావచన్నది ఆయన ఒపీనియన్.  ముఖ్యంగా భారీ ప్యాకేజీలలో ఉన్నవారి ఉద్యోగాలకు ఎసరు రావొచ్చని చెబుతున్నారు. సీనియర్ మేనేజర్ స్థాయిలో ఏడాదికి రూ.25 లక్షలు సంపాదించే వారి మెడపై కత్తి వేలాడుతోందని. ఒక వేళ వారే స్వచ్చంగా వేతనం తగ్గించుకుంటామని ముందుకు వచ్చినా వీరిని తీసుకునేందుకు కంపెనీలు ముందుకు రావని ఆయన వివరించారు.

ఐటీ రంగంలో రోజుకో టెక్నాలజీ వస్తుండటంతో పెద్ద కంపెనీలు ఉదాహరణకు కాగ్నిజెంట్ ఇన్పోసిస్ టెక్ మహీం ద్రాలు డిజిటైజేషన్ ఆటోమేషిన్ వైపు మొగ్గుచూపుతున్నాయి. దీంతో ఈ కంపెనీల్లో ఉద్యోగుల కోత మరో 1-2 సంవత్సరాల వరకు కొనసాగుతుందని ఈ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. పింక్ స్లిప్స్ (ఉద్యోగిని ఇంటికి పంపించే నోటీసు) ఇప్పటికే దేశంలోని పలు ఐటి కంపెనీల్లో సిద్దం చేసి ఉంచుకున్నాయి. ప్రస్తుతం భారతీయ సాఫ్ట్‌వేర్ ఎగుమతుల కంపెనీలు అమెరికా సింగపూర్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌ల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత కఠినమైన వీసా నిబంధనలు తీసుకురావడంతో మన ఐటి కంపెనీలు విలవిల్లా డుతున్నాయి. మన ఐటి కంపెనీలకు వచ్చే రెవెన్యూలో సింహభాగం అమెరికా మార్కెట్ నుంచే. అమెరికా వీసా నిబంధనలు కఠినతరం చేయ డంతో పాటు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని పట్టు బట్టడంతో మన ఐటి కంపెనీలకు దిక్కుతోచడం లేదు. దీంతో ట్రంప్ దారికి మన ఐటి కంపెనీలు రావాల్సిన పరి స్థితి ఏర్పడింది. అమెరికాను చూసి మిగిలిన దేశాలు కూ డా భారత్ కంపెనీల వీసా నిబంధనలను కఠినతరం చేయడం మొదలుపెట్టాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే  ఆర్టఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషిన్ క్లౌడ్ కంప్యూటింగ్‌ల రూపంలో ఉత్పాతం వస్తోంది.