Begin typing your search above and press return to search.

హైటెక్‌ సిటీలో ఐఎస్ ఐఎస్‌?

By:  Tupaki Desk   |   3 Aug 2015 2:54 PM GMT
హైటెక్‌ సిటీలో ఐఎస్ ఐఎస్‌?
X
ప్ర‌స్తుత స‌మాజాన్ని టెర్రరిజం ఠారెత్తిస్తోంది. ముఖ్యంగా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ ఆండ్ సిరియా (ఐఎస్ ఐఎస్‌) ఉగ్రవాదులు భయంకరమైన హత్యలు చేస్తున్నారు. అంత‌టితో ఆగిపోకుండా....త‌మ పైశాచిక చ‌ర్య‌ల‌ను రికార్డ్‌ చేసి అందరికీ చూపిస్తున్నారు. ఇది చాల‌ద‌న్న‌ట్లు ఇంట‌ర్‌ నెట్‌ లో ప్రచారం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ మద్దతుదారులను పెంచుకోవడమే లక్ష్యంగా ప్ర‌చారం చేస్తున్నారు. అయితే ఈ క‌ర‌డుగ‌ట్టిన ఉగ్ర‌వాదుల‌వైపు ఒక‌వ‌ర్గానికి చెందిన‌ కొంతమంది యువత ఆకర్షితులౌతున్నారు. అలాంటివారు ఇండియాలో కూడా ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ లో ఈ ఇబ్బంది ఎక్కువ‌గా ఉంద‌ని తెలుస్తోంది.

భాగ్యనగరం అంటేనే సాఫ్ట్‌ వేర్‌ కు ప్రసిద్ది. హైదరాబాద్‌ సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగులైన కొంతమంది యువకులు ఈ ప్రచార వీడియోలను డౌన్‌ లోడ్‌ చేసుకుని మరీ చూస్తున్నారు. అది కూడా వారి ఉద్యోగ వేళ‌ల్లో, ఆఫీసుల్లో చేయ‌డం గ‌మ‌నార్హం. ఇలా చేసిన ఒక యువకుడి గురించి పోలీసులకు సమాచారం అందిచింది ఒక కంపెనీ. దీంతో ఈ విష‌య‌మై కేవ‌లం ద‌ర్యాప్తు అనే కాకుండా అన్ని కోణాల్లోనూ ఆలోచించి పోలీసులు అడుగులు వేసిన‌ట్లు స‌మాచారం.

ఐస్ ఐఎస్‌ ఉచ్చులో ఈ ఐటీ యువకులు పడితే నగరానికి చాలా ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన‌ అవసరం ఉంద‌ని హైద‌రాబాద్ పోలీసులు భావించారు. కంప్లైంట్ వ‌చ్చిన నేప‌థ్యంలో సైబరాబాద్‌ పోలీసులు అప్రత్తమయి ఆయా కంపెనీల‌కు భద్రతను పెంచారు. రహస్యంగా మొత్తం వ్యవహారాల‌ను గమనిస్తున్నారని స‌మాచారం. మ‌రోవైపు తమ బలగాలతో పాటు ప్రతి కంపెనీ కూడా సొంతంగా భద్రత పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్పటికే విప్రో కంపెనీ తన భద్రత సిబ్బందికి ఆయుధాలను ఇచ్చింది.