Begin typing your search above and press return to search.

ఆపిల్‌ కే దెబ్బేసిన ఐసిస్‌

By:  Tupaki Desk   |   12 Feb 2016 10:30 PM GMT
ఆపిల్‌ కే దెబ్బేసిన ఐసిస్‌
X
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ ఆండ్ సిరియా. ఈ రాక్ష‌స‌మూక గురించి, అది చేసే ఆకృత్యాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అరాచ‌కానికి కేరాఫ్ అడ్ర‌స్ అంటే ఐసిస్ అనే చెప్తారు. ప్ర‌పంచ దేశాల‌ను త‌న రాక్ష‌స‌త్వంతో ముప్పుతిప్ప‌లు పెడ్తున్న ఈ ముష్క‌రులు ఐటీ - సాఫ్ట్‌ వేర్ దిగ్గజం ఆపిల్‌ ను దెబ్బతీయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఇందుకోసం కోట్లాది రూపాయలను కుమ్మరించడానికి వెనుకాడటం లేదు. ఈ వార్త బ‌య‌ట‌కు పొక్క‌డంతో కంగుతిన‌డం ఆపిల్ వంతైంది.

ఐసిస్‌ కు చెందిన హ్యాక‌ర్లు ఆపిల్ ఉద్యోగులకు వల విసురుతూ, ఒక్క లాగిన్ ఐడీ - పాస్ వర్డ్ ఇస్తే, లక్షల రూపాయలు ఇస్తామని ఆఫర్ ఇస్తున్నారు. ముఖ్యంగా జూనియర్ లెవల్ ఉద్యోగులకు, అప్పుడే చేరిన వారికి ఈ తరహా ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగులను కాంటాక్ట్ చేసే హాకర్లు వారిని లోబరచుకునేందుకు ప్ర‌యత్నిస్తున్నారని సమాచారం. ఆపిల్ సంస్థలో ఎంతమంది ఉద్యోగులకు ఈ తరహా ఆఫర్లు వస్తున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. "నా లాగిన్ వివరాలు చెబితే 20 వేల యూరోలు (సుమారు రూ. 15 లక్షలు) ఇస్తామన్నారు. నేను కావాలంటే ఇప్పుడే నా ఐడీ, పాస్ వర్డ్ అమ్మేసుకోవచ్చు" అని ఆపిల్ ఉద్యోగి ఒకరు వ్యాఖ్యానించడం ఆపిల్‌ లో ఉద్యోగుల మాన‌సిక స్థితికి, ఐసిస్ అరాచ‌కానికి నిద‌ర్శ‌నం.

అయితే ఈ విషయం ఆపిల్ యాజమాన్యం దృష్టికి వెళ్లింది. ఈ నేప‌థ్యంలో ఉద్యోగులను ఐసిస్ అరాచ‌క చర్యలకు దూరం చేసేందుకు అడుగులు వేసింది. ఈ క్ర‌మంలో "గ్రో యువర్ ఓన్" పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. త‌ద్వారా ఉద్యోగుల ఎదుగుద‌ల‌కు అవకాశాలు క‌ల్పించేందుకు, త‌ద్వారా డ‌బ్బుల ఎర‌లో ప‌డ‌కుండా ఉండేందుకు క‌స‌రత్తు చేస్తోంది.