ఏపీ రవాణా కమిషనర్ గా సీతారామాంజనేయులు

Wed Jun 12 2019 11:49:43 GMT+0530 (IST)

ఏపీ రవాణా శాఖ కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఆర్టీసీ భవన్ లోని రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. 1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన సీతారామాంజనేయులు గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఈయన ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. బీఎస్ఎఫై ఐజీగా పనిచేస్తున్నారు.ఈయన ఉమ్మడి ఏపీలో ఎస్పీగా కమిషన్ గా సేవలందించారు. ఖమ్మం గుంటూరు కర్నూలు జిల్లాలకు ఎస్పీగా చేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ గానూ సేవలందించారు. ఆ తర్వాత డిప్యూటేషన్ పై కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. అక్కడ బీఎస్ఎఫ్ ఐజీగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇటీవలే తిరిగి ఏపీకి జగన్ కోరిక మేరకు వచ్చారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో ఐపీఎస్ సీతారామాంజనేయులుకు మంచి అనుబంధం ఉంది. నిజానికి ఈయననే జగన్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమిస్తారని ఊహాగానాలు చెలరేశాయి. కానీ వైఎస్ జగన్ అతి ముఖ్యమైన క్లిష్ట సమస్యలతో ఉన్న ట్రాన్స్ పోర్టు కమిషనర్ గా నియమించింది. 

 కేంద్ర సర్వీసుల్లో ఉన్న బీఎస్ఎఫ్ ఐజీ సీనియర్ ఐపీఎస్ రామాంజనేయులు ఏపీకి రావడానికి చేసుకున్న దరఖాస్తును కేంద్రం ఆమోదించి.. ఏపీ సీఎస్ కు రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. జగన్ ఆయనను ఏపీ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ను  నియమించారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్దిరోజుల్లోనే జగన్ తన టీంను పకడ్బందీగా రెడీ చేసుకుంటున్నారు. ప్రభుత్వం మీద పట్టురాకుండానే ఈ స్థాయిలో ఆలోచిస్తున్నారంటే ఇక మున్ముందు ఎన్ని సంచలనాలు నమోదు చేస్తాడనేది ఆసక్తిగా మారింది.
 
ఏపీలో ఇప్పుడు ఆర్టీసీ అంపశయ్యపై ఉంది. నష్టాలతో దాన్ని ప్రభుత్వం టేకప్ చేస్తోంది. అటువంటి సంస్థ ప్రభుత్వానికి ఆర్థిక భారం కాకుండా చేయడంతోపాటు ప్రజలకు నిత్య అవసరమైన ఆర్టీసీని గాడినపెట్టాలంటే సీనియర్ అధికారులు కావాలి. అందుకే కేంద్ర సర్వీసుల్లో ఉన్న పి. రామాంజనేయులు శక్తి సామర్థ్యాలను గుర్తించి జగన్ ఆయనను రాష్ట్రానికి రప్పిస్తున్నారు. ఇప్పటికే బీఎస్ఎఫ్ ఐజీగా ఆయన మంచి పేరు పరిపాలన దక్షుడిగా పేరుగాంచాడు. అందుకే సొంత రాష్ట్రానికి ఆయన సేవలను గుర్తించి జగన్ కోరగానే ఆయన రావడానికి ఒప్పుకొని కేంద్రహోంశాఖ నుంచి రిలీవ్ అయ్యారు. ఇప్పుడు ఏపీ రవాణాశాఖ కమిషనర్ గా ఆయనపై గురుతర బాధ్యతను జగన్ పెట్టారు. మరి ఈ స్టిక్ట్ ఆఫీసర్  ఎలాంటి అద్భుతాలు చేస్తాడన్నది వేచిచూడాల్సిందే.