Begin typing your search above and press return to search.

వార్ లో అమెరికా మీద భారత్ విజయం

By:  Tupaki Desk   |   30 Nov 2015 4:27 AM GMT
వార్ లో అమెరికా మీద భారత్ విజయం
X
టైటిల్ చూసినంతనే కాస్తంత ఆశ్చర్యం కలగటం ఖాయం. వార్ లో అమెరికా మీద భారత్ గెలవటమా? అన్న ప్రశ్న రాక మానదు. అత్యంత అధునాతన సాంకేతికత ఉన్న అమెరికా మీద భారత్ కలలో కూడా పైచేయి సాధించటమే ఉండదు. అలాంటిది విజయం కూడానా? అని సాగదీసే వాళ్లూ ఉంటారు. కానీ.. అలాంటి పరిస్థితి నిజంగానే జరిగింది. కాకపోతే.. ఈ వార్ రియల్ వార్ కాకున్నా.. రియల్ వార్ లా ఒక పరీక్ష సందర్భంగా దక్కిన విజయంగా దీన్ని చెప్పొచ్చు.

మలబార్ లో నావికాదళాల మధ్య నౌకా విన్యాసాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సందర్భంగా అమెరికా.. జపాన్ భారత్ నావికా సిబ్బంది మధ్య పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా అమెరికా..భారత్ మధ్య ఒక ఒక పోటీ పెట్టారు. దీని ప్రకారం.. బంగాళాఖాతంలో నావికా సిబ్బందిని ఎవరు ఎవరిని ముందు పట్టుకుంటారన్నది ఒక పోటీ పెట్టారు.

ఇందులో భాగంగా జలాంతర్గామిలను రంగంలోకి దింపారు. అయితే.. భారత్ ఇటీవల ఒక సాంకేతికతను అభివృద్ధి పరిచింది. దీని ప్రకారం.. నీటి అడుగున శబ్దాల్ని పసిగట్టేలా ఒక టెక్నాలజీని రూపొందించింది. దీన్ని భారత జలాంతర్గామి సింధుధ్వజ్ లో ఏర్పాటు చేశారు. ఈ టెక్నాలజీ సాయంతో.. అమెరికా జలాంతర్గామిని గుర్తు పట్టేశారు. ధ్వని తరంగాల ద్వారా ప్రత్యర్థి జలాంతర్గామిని గుర్తించటంతో అమెరికా మీద భారత్ పైచేయి సాధించింది.