Begin typing your search above and press return to search.

ఉగ్రవాదిని కాంగ్రెస్ ఎమ్మెల్యే కలిసారా ?

By:  Tupaki Desk   |   1 Aug 2015 7:07 AM GMT
ఉగ్రవాదిని కాంగ్రెస్ ఎమ్మెల్యే కలిసారా ?
X
నేరస్తుడితో పరిచయం ఉండటం.. పరారీలో ఉన్న వారిని కలుసుకోవటం.. వారికి సహాయ సహకారాలు అందించటం పెద్ద నేరం. కానీ.. భారత్ దేశాన్ని ఉగ్రవాదంతో దెబ్బ తీయటమే కాకుండా.. భారీగా ప్రాణ నష్టం జరగటంలో కారణమైన ఒక తీవ్రవాదిని ఒక ప్రజాప్రతినిధి కలుస్తారా? అంటే.. భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో మాత్రమే ఇలాంటి సాధ్యమవుతాయి.

దేశాన్ని ఏలే అధికారం తమకు మాత్రమే ఉందని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఒక ఎమ్మెల్యే గతంలో తాను చేసిన పనిని తాజాగా వెల్లడించి సంచలనం సృష్టిస్తున్నాడు.

జమ్మూకాశ్మీర్ లోని బాండీపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉస్మాద్ మజీద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 257 మంది మృతికి కారణమైన టైగర్ మెమన్ ను తాను పాక్ అక్రమిత కాశ్మీర్ లో కలిసినట్లు చెప్పుకొచయచారు.

1993లో తాను టైగర్ మెమన్ ను రెండుసార్లు కలిసినట్లు చెప్పిన మజీద్.. తనకు అతనేమీ స్నేహితుడు కాకున్నప్పటికీ.. తమ పార్టీ ఆపీసుకు వస్తుండేవాడని వ్యాఖ్యానించాడు. స్టూడెంట్ లిబరేషన్ ఫ్రంట్ వ్యవస్థాపకురాలు.. ఇక్వాన్ ఆల్ ముస్లిమీన్ మిలిటెంట్ గ్రూప్ చీఫ్ హిలాల్ బేగ్ తనకు టైగర్ మెమన్ ను పరిచయం చేసినట్లువెల్లడించాడు.

ముంబయి బాంబు పేలుళ్లు ఎందుకు చేశామని తాను టైగర్ మెమన్ ని అడిగానని.. అయోద్యలోని వివాదాస్పద కట్టటం.. అనంతరం చేసుకున్న అల్లర్లకు ప్రతీకారంగానే తామీ పని చేసినట్లు చెప్పిన టైగన్ మెమన్.. తమకు సహాయ సహకారాలన్నీ పాకిస్థాన్ దేశం సమకూర్చిందని చెప్పుకొచ్చినట్లుగా వెల్లడించాడు. అప్పుడెప్పుడో 1993లో టైగర్ మెమన్ ని కలిస్తే.. దాదాపు ఇన్నేళ్ల తర్వాత ఒక ఉగ్రవాదిని కలిసినట్టుగా చెప్పటం చూసినప్పుడు సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యేకు దేశం పట్ల ఉన్న కమిట్ మెంట్ ఏమిటో ఇట్టే అర్థం అవుతుంది.

ఒక ప్రజాప్రతినిధిగా తన దేశంలోని ప్రజానీకాన్ని దారుణంగా చంపేసిన వ్యక్తిని చట్టం ముందుకు తీసుకొచ్చేలా చేయటం మానేసి.. కలవటం..కులాసాగా కబుర్లు చెప్పటం చూస్తుంటే.. ఈ దేశంలోని నేతలకు సంఘ విద్రోహక శక్తుల సంబంధాలు ఉన్నా లేకున్నా.. వారి ఆచూకీ సంబంధించి వివరాలపై మాత్రం అవగాహన ఉంటుందన్న విషయం మరోసారి రుజువైందని చెప్పక తప్పదు.