Begin typing your search above and press return to search.
ఆన్ బెల్ మూవీ ఆమెను అలా చేసేసింది
By: Tupaki Desk | 22 Aug 2017 5:00 PM GMTసినిమా మనిషి మీద చూపించే ప్రభావం మీద చాలామంది చాలా చెబుతారు. ఎవరేం చెప్పినా.. సినిమా ఎంతోకొంత ప్రభావం చూపిస్తుందనటంతో సందేహం లేదు. కొద్దిరోజుల ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఆనబెల్ మూవీని చూసిన ఒక మహిల చేసిన వికృత చేష్ట ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. బ్రెజిల్ లో జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.
బ్రెజిల్ లోని టెరెసినా ప్రాంతానికి చెందిన ఓ 20 ఏళ్ల యువతి తన ఫ్రెండ్స్ తో కలిసి ఆనబెల్ హార్రర్ మూవీకి వెళ్లాఆరు. సినిమా చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వస్తూ ఉన్నట్లుండి గట్టిగా కేకలు వేయటం మొదలు పెట్టింది. తనను తాను కొట్టుకుంటూ.. గాయం చేసుకుంటూ వింతగా వ్యవహరించటం మొదలెట్టింది.
ఆమెను వారించి.. కంట్రోల్ చేయటానికి ఆమె స్నేహితులు ప్రయత్నించినా.. ఆమె కంట్రోల్ కాలేదు. దీంతో.. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. హాలీవుడ్ దర్శకుడు డేవిడ్ శాండ్ బర్గ్ తెరకెక్కించిన ఈ ఆనబెల్ చిత్రం రెండో పార్ట్ ఇటీవల విడుదలైంది. సదరు యువతి తనను తాను కొట్టుకుంటూ.. గాయపర్చుకుంటున్న దృశ్యాల్ని కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.