పెళ్లి పత్రికలో మోడీకి ఓటేయమంటున్నాడు!

Mon Feb 11 2019 19:42:14 GMT+0530 (IST)

మోడీ అభిమానులకు మోడీ ఏం చేసినా రైటే. వాళ్లు ఓ టైపు. వారి వ్యక్తిగత జీవితాన్ని రాజకీయ ఆలోచనలను వేరు చేసి చూడరు. అందుకే మిగతావారిని అభిమానులు అంటారు మోడీ అభిమానులను మాత్రం మోడీ భక్త్స్ అంటారు. ఇంతకీ హైదరాబాదుకు చెందిన ఓ అభిమాని ఏం చేశారో తెలుసు... తన పెళ్లిపత్రికను మోడీ కరపత్రికగా మార్చేశారు.తెలంగాణ విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీరుగా పనిచేస్తున్న ముఖేష్ రావుకు మోడీ అంటే పిచ్చి. అసలు దేశాన్ని సరైన మార్గంలో పెట్టడానికి వచ్చిన దైవ దూత అన్న రేంజిలో అతను ఫీలవుతుంటారు. అందుకే ఒక గవర్నమెంటు ఉద్యోగి అయినా కూడా ఏకంగా వెడ్డింగ్ కార్డులో * వచ్చే ఎన్నికల్లో మోడీకి ఓటేయండి. నాకు మీరిచ్చే పెళ్లి గిఫ్ట్ అదే అనుకుంటాను* అంటూ ముద్రించుకున్నారు. తన కార్యక్రమాలతో పథకాలతో దేశాన్ని నరేంద్ర మోడీ సవ్యంగా ముందుకు నడిపిస్తున్నాడని ముఖేష్ రావు అభిప్రాయపడ్డారు.

మోడీ మళ్లీ దేశంలో ప్రధాని కావాలనే ఉద్దేశంతోనే ఇక్కడ టీఆర్ఎస్ కు గత ఎన్నికల్లో మద్దతు ఇచ్చాను అని చెబుతున్నారాయన. అంటే టీఆర్ఎస్ వేసే ఓటు మోడీకే వేసినట్టు మోడీ బీజేపీ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అందుకే గత ఎన్నికల్లో బీజేపీకి పడాల్సిన చాలా ఓట్లు టీఆర్ఎస్‌కు పడినట్లు అర్థమవుతోంది. ఇదంతా పక్కన పెడితే ఎవరు ఏమనుకున్నా నా పంథా ఇదే. నా పెళ్లికి రండి. నన్ను ఆశీర్వదించండి. ఓటు మాత్రం మోడీకి వేయండి అని ముఖేష్ తన అభిమానాన్ని చాటుకున్నారు.