Begin typing your search above and press return to search.

అమెరికాలో హైద‌రాబాదీపై కాల్పులు

By:  Tupaki Desk   |   10 Dec 2017 4:29 AM GMT
అమెరికాలో హైద‌రాబాదీపై కాల్పులు
X
గ‌డిచిన కొద్దికాలంగా అగ్ర‌రాజ్య‌మైన అమెరికాలో మ‌నోళ్ల మీద దాడులు జ‌రుగుతున్నాయి. తాజాగా అలాంటిదే మ‌రో దాడి జ‌రిగింది. హైద‌రాబాద్ యువ‌కుడు మ‌హ్మ‌ద్ అక్బ‌ర్ పై అమెరికాలోని షికాగోలో గుర్తు తెలియ‌న దుండ‌గులు కాల్పులు జ‌రిగాయి.

కంప్యూట‌ర్ ఇంజినీరింగ్‌ కోర్సు చేసిన మ‌హ్మ‌ద్ అక్బ‌ర్ పై చ‌దువుల కోసం నెల క్రిత‌మే అమెరికాకు వెళ్లారు. ప్ర‌స్తుతం ఆయ‌న షికాగోలో ఉంటున్నారు. ఇటీవ‌ల షికాగాలోని అల్ బిర్ని పార్కుకు వెళ్లిన అక్బ‌ర్.. కారు పార్కింగ్ వ‌ద్ద ఉన్నారు. ఆ స‌మ‌యంలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అత‌నిపై కాల్పులు జ‌రిపారు.

ఈ కాల్పుల్లో అబ్బ‌ర్ గ‌డ్డం కింద‌.. మ‌రో చోట గాయాల‌య్యాయి. వెంట‌నే అత‌డ్నిఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం అక్బ‌ర్ ఆరోగ్య ప‌రిస్థితి క్లిష్టంగా ఉన్న‌ట్లుగా హైద‌రాబాద్ లో ఉన్న ఆయ‌న కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న అక్బ‌ర్ గురించి ఆయ‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఆందోళ‌న చెందుతున్నారు.