Begin typing your search above and press return to search.

స‌న్ బ‌ర్న్ షో లో సెన్సేష‌న్ !

By:  Tupaki Desk   |   24 Nov 2017 5:54 PM GMT
స‌న్ బ‌ర్న్ షో లో సెన్సేష‌న్ !
X
భాగ్య‌న‌గ‌రి హైద‌రాబాదులోని గ‌చ్చిబౌలి స్టేడియం వేదిక‌గా కాసేప‌టి క్రితం అట్ట‌హాసంగా మొద‌లైన స‌న్ బ‌ర్న్ సంరంభంలో ఆదిలో పెను క‌ల‌క‌లం రేగింది. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక రేటింగ్ క‌లిగిన స‌న్ బ‌ర్న్ వేడుక నిర్వ‌హ‌ణ‌పై మొద‌టి నుంచే ఆందోళ‌న‌లు వెల్లువెత్తినా... నిర్వ‌హకులు మాత్రం వెన‌క్కు త‌గ్గ‌లేదు. ఈ విష‌యంపై విప‌క్షాలు హైకోర్టుకు వెళ్లినా కూడా.. అక్క‌డా ఈ వేడ‌క‌కు అనుమ‌తి ల‌భించ‌డంతో ఇక ఆ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకునేందుకు యువ‌త బారులు తీరింది. గోవా లాంటి ప‌ర్యాట‌క ప్రాంతాల్లో ఏటా భారీ హోరుతో జ‌రిగే ఈ త‌ర‌హా కార్య‌క్ర‌మాలు హైద‌రాబాదు లాంటి ప్రాంతాల్లో అంత‌గా స‌క్సెస్ అవుతాయా? అన్న అనుమానాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ హైద‌రాబాదీ యువ‌త ఈ కార్య‌క్ర‌మానికి తండోప‌తండాలుగా విచ్చేశారు. టికెట్ ఖ‌రీదును వేల రూపాయ‌ల్లో నిర్ణ‌యించినా కూడా ఆహుతుల సంఖ్య మాత్రం ఏమాత్రం త‌గ్గ‌లేద‌నే చెప్పాలి.

సంగీతం హోరుతో వెర్రెత్తిపోయే ఈ త‌ర‌హా కార్య‌క్ర‌మాలంటే న‌గ‌ర యువ‌త‌కు మొద‌టి నుంచి మ‌క్కువ ఎక్కువే. అయితే గోవా లాంటి ప్రాంతాల్లో సౌక‌ర్యాల‌కు కొద‌వేమీ లేకున్నా... హైద‌రాబాదులో న్యూ ఇయ‌ర్ పార్టీ వేడుక‌లు త‌ప్పించి ఇప్ప‌టిదాకా ఈ వేడుక‌లు పెద్ద‌గా జ‌ర‌గ‌లేద‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో కొంగొత్త‌గా ఉన్న స‌న్ బ‌ర్న్ లాంటి కార్య‌క్ర‌మం అన‌గానే... యువ‌త చిందులేసింది. భారీ అంచ‌నాల మ‌ధ్య నేటి సాయంత్రం మొద‌లైన ఈ కార్య‌క్ర‌మానికి ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల కింద పోలీసులు కూడా భారీ ఎత్తున భ‌ద్ర‌త క‌ల్పించారు. ప్ర‌స్తుతం గ‌చ్చిబౌలి స్టేడియం ప‌రిస‌రాలు స‌ర్ బ‌ర్న్ హోరుతో హోరెత్తిపోతోంది. అదే స‌మ‌యంలో పోలీసులు కూడా స్టేడియం చుట్ట‌ప‌క్క‌ల ప్రాంతాల‌ను త‌మ అధీనంలోకి తీసుకున్నారు. ఎక్క‌డ కూడా చిన్న అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోరాద‌న్న భావ‌న‌తో పోలీసులు పెద్ద ఎత్తున భ‌ద్ర‌త క‌ల్పించినా... పెద్ద‌గా ఫ‌లితం లేద‌ని తేలిపోయింది.

పోలీసు భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌ను చేధించుకుని వ‌చ్చిన ఓ యువ‌కుడు... ఆయుధంతో స‌న్ బ‌ర్న్ ప్రాంతానికి చేరుకున్నాడు. అయితే ఆ యువ‌కుడు స‌న్ బ‌ర్న్ కార్య‌క్ర‌మ ప్రాంగ‌ణంలోకి వెళ్ల‌క‌ముందే పోలీసులు అత‌డిని, అత‌డి వ‌ద్ద ఉన్న ఆయుధాన్ని ప‌ట్టేసుకున్నారు. ఇటీవ‌లి కాలంలో ప్ర‌పంచ ప్ర‌సిద్ధి గాంచిన న‌గ‌రాల్లో జ‌రిగిన మ్యూజిక్ కాన్స‌ర్ట్‌ల‌పై ఉగ్ర‌వాదులు విరుచుకుప‌డిన నేప‌థ్యంలో స‌న్ బ‌ర్న్ హైద‌రాబాదు వేదిక వ‌ద్ద కూడా ఆయుధంతో ఓ యువ‌కుడు ప‌ట్టుబ‌డిపోయాడ‌న్న వార్త దావాన‌లంలా వ్యాపించింది. దీంతో అక్క‌డ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అయితే భ‌య‌ప‌డాల్సింది ఏమీ లేద‌న్న పోలీసుల ప్ర‌క‌ట‌న‌తో కార్య‌క్ర‌మానికి ఎలాంటి ఆటంకాలు లేకున్నా... ఎప్పుడేం జ‌రుగుంతోద‌న్న భ‌యం మాత్రం నెల‌కొని ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.