Begin typing your search above and press return to search.

డొల్ల కంపెనీల్లో మ‌నోళ్ల లిస్ట్ బ‌య‌ట‌కొచ్చేసింది

By:  Tupaki Desk   |   20 Sep 2017 5:38 AM GMT
డొల్ల కంపెనీల్లో మ‌నోళ్ల లిస్ట్ బ‌య‌ట‌కొచ్చేసింది
X
కాగితాల మీద కంపెనీల్ని చూపే ఘ‌నుల గుట్టు ర‌ట్టైంది. డొల్ల కంపెనీల్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి.. ఏటా ఎంత ట‌ర్నోవ‌ర్ వ‌చ్చిందో తెలుసా? అంటూ అక్ర‌మ దందాలు సాగించే అక్ర‌మార్కుల‌పై కేంద్ర కార్పొరేట్ వ్య‌వ‌హారాల శాఖ కొర‌డా ఝుళిపించింది. దేశంలో ఉన్న డొల్ల కంపెనీల్లో హైద‌రాబాద్ మూడోస్థానంలో ఉన్న‌ట్లుగా తేలింది.

ఏడాదికి ఏడాది డొల్ల కంపెనీల్ని ఏర్పాటు చేయ‌టంలో మొన‌గాడు లాంటి న‌గ‌రం హైద‌రాబాద్ అని.. ఇక్క‌డ పెద్ద ఎత్తున డొల్ల కంపెనీల్ని ఏర్పాటు చేస్తున్న విష‌యాన్ని గుర్తించ‌ట‌మే కాదు.. అలాంటి కంపెనీల‌కు డైరెక్ట‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న 41,068 మందిపై అన‌ర్హ‌త వేటు వేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఢిల్లీ.. ముంబ‌యి త‌ర్వాత డొల్ల కంపెనీలు అత్య‌ధికంగా ఉన్న‌ది హైద‌రాబాద్ లోనేన్న విస‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇలాంటి వారిపై అన‌ర్హ‌త వేటు వేస్తూ.. ఐదేళ్ల పాటు వారే కంపెనీలోనూ డైరెక్ట‌ర్లుగా ప‌ని చేయ‌కుండా బ్యాన్ విధించింది. ఇలాంటి విష‌యాల్ని గుట్టుగా ఉంచేస్తే.. మ‌రో కంపెనీకి వీరు వెళ్లే అవ‌కాశం ఉండ‌టంతో.. అలా జ‌ర‌గ‌కుండా ఉండేందుకు వీలుగా వారి పేర్ల‌ను బ‌య‌ట‌కు చెప్పేసింది. పెద్ద‌నోట్ల ర‌ద్దు అనంత‌రం దేశ వ్యాప్తంగా ఉన్న షెల్ కంపెనీల‌పై కేంద్ర కార్పొరేట్ వ్య‌వ‌హారాల శాఖ దృష్టి సారించింది. ఏదో ఒక పేరుతో కంపెనీ పెట్టి వాటి ఆదాయ అంశాల‌పై రిట‌ర్న్ లు దాఖ‌లు చేయ‌టం లేద‌ని.. ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డుతున్న‌ట్లుగా కేంద్రం నిర్దారించారు. ఈ త‌ర‌హా అక్ర‌మాల‌కు హైద‌రాబాద్ అడ్డంగా నిలిచింద‌ని తేల్చింది.

రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వేల సంఖ్య‌లో కంపెనీల‌ను ప్రారంభించార‌ని అందులో డైరెక్ట‌ర్లుగా పేర్కొన్న 41,068 మంది డైరెక్ట‌ర్ల పై నిషేధం విధించింది. మూడు ఆర్థిక సంవ‌త్స‌రాల‌కు (2013 నుంచి 2016 వ‌ర‌కు) సంబంధించిన ఆర్థిక‌నివేదిక‌లు.. వార్షిక రిట‌ర్న్ లు స‌మ‌ర్పించ‌క‌పోవ‌టం.. డిపాజిట్ల‌ను తిరిగి చెల్లించ‌టంలో నిర్ల‌క్ష్యం.. ఏళ్ల‌కు ఏళ్లు ఎగ్గొట్ట‌టం లాంటి త‌ప్పుల నేప‌థ్యంలో వారిపై నిషేధం విధించారు. అలా వేటు ప‌డిన వారిలో..

= టీడీపీ ఎంపీ సుజ‌నా చౌద‌రికి చెందిన సుజ‌నా ప‌వ‌ర్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ముగ్గురు డైరెక్ట‌ర్లు (శంక‌ర్ కుందులా.. హ‌నుమంత‌రావు.. శ్రీనివాస గొట్టుముక్క‌ల‌)
= డాక్ట‌ర్ రెడ్డిస్ సంస్థ‌కు చెందిన అంజిరెడ్డి
= డెక్క‌న్ క్రానిక‌ల్ హోల్డింగ్స్‌.. డెక్క‌న్ మార్కెటింగ్‌.. డెక్క‌న్ ప‌వ‌ర్ లిమిటెడ్ కంపెనీల్లో డైరెక్ట‌ర్లుగా ఉన్న తిక్క‌వ‌ర‌పు మంజుల‌.. వెంక‌ట్ తో పాటు మ‌రో డైరెక్ట‌ర్ కూడా అన‌ర్హులు
= ప్రొగ్రెసివ్ క‌న్ స్ట్ర‌క్ష‌న్స్ సంస్థ డైరెక్ట‌ర్ నాగేశ్వ‌ర‌రావు
= మెగా సిమెంట్స్ అండ్ కెమిక‌ల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్ట‌ర్లు
= విజ‌య‌వాడ షేర్ బ్రోక‌ర్స్ లిమిటెడ్‌కు చెందిన 12 మంది
= ఎస్ కే బిగ్ స్టార్ ఫుడ్స్ లిమిటెడ్ కు చెందిన 12 మంది
= వంశీ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన ఆరుగురు
= కీర్తి అనురాగ్ ఇన్వెస్ట్ మెంట్స్‌కు చెందిన తొమ్మిదిమంది
= కోర‌మాండ‌ల్ పెస్టిసైడ్స్ సంస్థ డైరెక్టర్లు
= అగ్రిగోల్డ్ ఫుడ్స్ అండ్ ఫామ్స్ డైరెక్ట‌ర్లు అవ్వా శివ‌రాం.. అవ్వాశ‌ర్మ‌.. వెంక‌ట్ కృష్ణ‌
= రాజ‌మండ్రి చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ కు చెందిన 8 మంది డైరెక్ట‌ర్లు
= హైద‌రాబాద్ కెమిక‌ల్ అండ్ ఫార్మాస్యూటిక‌ల్ లిమిటెడ్‌కు చెందిన న‌లుగురు
= నార్నే హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌
= మార్వెల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ‌ల డైరెక్ట‌ర్లు నార్నే రావు.. నార్నే శ్రీనివాస‌రావు.. నార్నే మ‌ల్లీశ్వ‌రి.. గ‌ద్దె శ్రీ వెంక‌ట్‌.. నార్నే సుబ్బాయ‌మ్మ‌.. గ‌ద్దె విజ‌య‌శ్రీ
= ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ లిమిటెడ్ లో డైరెక్ట‌ర్లుగా ఉన్న ఐదుగురు
= సంఘీ ఇండ‌స్ట్రీస్ కంపెనీలో డైరెక్ట‌ర్లు
= 4 వేల రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌లు
= 6 వేల‌కు పైగా చిట్ ఫండ్స్ కంపెనీల డైరెక్ట‌ర్లు
= ఐటీ.. సెక్యూరిటీ.. ఇన్ ఫ్రా సంస్థ‌ల‌కు చెందిన డైరెక్ట‌ర్లు