Begin typing your search above and press return to search.

హైద‌రాబాదీల మైండ్ బ్లాంక్ చేస్తున్న సెక్స్ రాకెట్‌

By:  Tupaki Desk   |   24 Jun 2018 10:48 AM GMT
హైద‌రాబాదీల మైండ్ బ్లాంక్ చేస్తున్న సెక్స్ రాకెట్‌
X
షికాగోలోని ఓ తెలుగు సినిమా సహా నిర్మాత సినిమా అవకాశాలు లేని హీరోయిన్లను వ్యభిచారానికి ప్రోత్సహించిన ఘటన సంచలనం సృష్టించింది. తెలుగు అసోసియేష‌న్ కార్య‌క్ర‌మాల పేరుతో అమెరికాకు రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్ల స్పష్టం కావడం…దాని వెనుక తానా ప్రతినిధులు కొందరు ఉన్నారని తేలడంతో అమెరికాలోని తెలుగువారికి త‌ల తీసేసినంత ప‌న‌యిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ప‌రంప‌ర అక్క‌డితోనే ఆగిపోలేదు. హైద‌రాబాదీల‌కు సైతం షాకిస్తోంది. షికాగోలో సెక్స్‌ రాకెట్‌ వెలుగు చూడటంతో యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ విభాగం అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని కట్టడి చేయాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో హైద‌రాబాదీల‌కు చెందిన ద‌ర‌ఖాస్తులను పెద్ద ఎత్తున రిజెక్ట్ చేస్తున్నారు.

షికాగోలో సెక్స్‌ రాకెట్‌ వెలుగు చూడటం.. ఆ మొత్తం వ్యవహారంలో తెలుగు అసోసియేషన్‌ అఫ్‌ నార్త్‌ అమెరికా(తానా) ప్రతినిధుల ప్రమేయం ఉంటడంతో తెలుగు సదస్సులకు వెళ్లేవారి దరఖాస్తులను కాన్సులేట్‌ పూర్తిగా పరిశీలిస్తోంది. ఏ మాత్రం అనుమానం వచ్చినా రెడ్‌ మార్క్‌ పెడుతోంది. దీంతో సినీ - టీవీ కళాకారులకు వీసాలు రాని పరిస్థితి ఎదురైంది. వీసా కోసం ఆన్‌ లైన్‌ లో డీఎస్‌ 160 ఫామ్‌ సమర్పించాలి. ఆ ఫామ్‌లో తెలిపిన వివరాల ఆధారంగా వీసా ఇవ్వాలా? లేదా? అన్న నిర్ణయానికి వస్తారు. అందులో దరఖాస్తుదారుడి ఆర్థిక పరిస్థితి.. ఆస్తులు తదితర వివరాలు చూస్తారు. తిరిగి వస్తాడా? లేదా? అన్నదానికే పరిమితమవుతారు. కానీ షికాగో ఘటన తర్వాత తెలుగు సదస్సులకు వెళ్లే 90 శాతం మంది వీసా దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు.

తానా - ఆటా - నాటా ఇలా ఏ సదస్సుకు హాజరయ్యే వారికి అయినా వారి ఆర్థిక పరిస్థితిని బట్టి వీసాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ సదస్సులకు వెళతామని అంటున్న వారికి ఏ ప్రశ్నలూ లేకుండానే వీసా తిరస్కరిస్తున్నారు. గత 15 రోజుల్లో ఇలా వెళ్లిన వారిలో 90 శాతం మందికి వీసా ఇవ్వడానికి యూఎస్‌ కాన్సులేట్‌ తిరస్కరించింది. మే నెలలో యూఎస్‌ వీసా కోసం వచ్చిన (B1 -B2) దరఖాస్తుల్లో 65 శాతం మందికి వీసాలు మంజూరయ్యాయి. అదే జూన్‌ మధ్యకు వచ్చేసరికి వీసా తిరస్కరణలు 70 శాతానికి పెరిగాయి. మే 12వ తేదీ–28వ తేదీ మధ్య మూడు వేల మంది వీసా ఇంటర్వ్యూకు హాజరైతే.. 1,950 మందికి వీసా మంజూరైంది. అదే మే 29వ తేదీ–జూన్‌ 22వ తేదీ వరకూ సుమారు 4 వేల మంది వీసా ఇంటర్వ్యూకు హాజరైతే 1,350 మందికే వీసాలు దక్కాయి. షికాగో సెక్స్ రాకెట్ మూలంగా తెలుగువారి ప‌రువు పోవ‌డంతో పాటుగా...న‌గ‌రంలోని వారికి సైతం బ్యాడ్ టైం మొద‌లైంద‌ని అంటున్నారు.