Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ మెట్రో జ‌ర్నీలో రూల్స్ ఇవే!

By:  Tupaki Desk   |   22 Nov 2017 5:02 AM GMT
హైద‌రాబాద్ మెట్రో జ‌ర్నీలో రూల్స్ ఇవే!
X
ఏళ్ల‌కు ఏళ్లుగా క‌ల కంటున్న హైద‌రాబాదీయుల కోరిక మ‌రో ఆరు రోజుల్లో తీర‌నుంది. ట్రాఫిక్ పద్మ‌వ్యూహం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు.. ట్రాఫిక్ జాం తిప్ప‌లకు చెక్ చెప్పేలా ఉంటుంద‌ని భావిస్తున్న‌ హైద‌రాబాద్ మెట్రోరైల్ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రానుంది.

మెట్రోరైల్ రావ‌ట‌మైతే వ‌స్తోంది. మ‌రి.. ఈ రైల్ లో ప్ర‌యాణించాల‌నుకునే వారు కొన్ని రూల్స్ ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సి ఉంటుంది. ఈ విష‌యంలో ఏ మాత్రం తేడా దొర్లినా అన‌వ‌స‌ర‌మైన ఇబ్బందులు త‌ప్ప‌వు. హైద‌రాబాదీయుల జ‌న జీవితాల్లో భాగం కానున్న మెట్రోకు సంబంధించిన రూల్స్ మీద అవ‌గాహ‌న త‌ప్ప‌నిస‌రి.

త‌ప్పు జ‌రిగాక రూల్స్ తెలుసుకునే క‌న్నా.. ముందే నిబంధ‌న‌ల‌పై ఒక అవ‌గాహ‌న త‌ప్ప‌నిస‌రి. అధునాత‌న‌మైన మెట్రో రైల్ స్టేష‌న్లో ప్ర‌యాణికులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ఏ మాత్రం తేడా చేసిన అన‌వ‌స‌ర‌మైన ఇబ్బందుల‌కు గురి కావ‌టం ఖాయం. మెట్రో స్టేష‌న్లోకి ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వ‌ర‌కూ నిఘా నేత్రం ప్ర‌తి ప్ర‌యాణికుడ్ని జాగ్ర‌త్త‌గా అబ్సర్వ్ ఇంత‌కీ మ‌న మెట్రో స్టేష‌న్లో ఏం చేయొచ్చు.. ఏం చేయ‌కూడ‌ద‌న్న‌ది చూస్తే..

ముందుగా ఏం చేయ‌కూడ‌దంటే..

- మెట్రో ప్రాంగణాల్లో ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయ‌కూడ‌దు. చెత్త‌ను పారేయ‌టం నిషిద్ధం.

- మెట్రోస్టేష‌న్లో పాన్‌.. గుట్కా.. తంబాకు న‌మ‌ల‌కూడ‌దు.

- మెట్రో ప్రాంగ‌ణంలో పొగ తాగ‌టం.. మ‌ద్యం సేవ‌టం లాంటివి అస్స‌లు చేయ‌కూడ‌దు

- మెట్రో స్టేష‌న్లలో ఫొటోలు తీయకూడదు

- మెట్రో ప్రాంగణాల్లో వస్తువులు - లగేజీ వదిలి వెళ్లరాదు

- మెట్రో ప్రాంగ‌ణంలో స‌ర‌దాగా స్నాక్స్ తిన‌టం.. కూల్ డ్రింక్స్ తాగ‌టం లాంటివి చేయ‌కూడ‌దు

- మెట్రో రైల్లో పెంపుడు జంతువులను తీసుకువెళ్లడానికి అనుమతి లేదు.

- నిషేధిత - మండే పదార్థాలను మెట్రోలోకి అనుమ‌తించరు

- భారీ ల‌గేజీకి అనుమ‌తి లేదు

- ఎస్కలేటర్లపై కూర్చోవడం - అడ్డుకునే ప్రయత్నాలు చేయకూడదు.

- ప్లాట్‌ ఫాంపై రైళ్ల కోసం వెయిట్ చేసే వేళ పసుపు రంగుతో ఉన్న ద‌గ్గ‌ర హద్దును దాటి వెళ్లకూడదు.

- రైలు తలుపులను బలవంతంగా తెరిచే ప్రయత్నించవద్దు.

- మెట్రో రైల్లో పిల్లలను జాగ్రత్తగా ప‌ట్టుకొనే ఉండాలి

- మెట్రో స్మార్ట్‌ కార్డు - టోకెన్‌ ను ఇతరులతో పంచుకోరాదు.

- భద్రతా సిబ్బంది అనుమతి లేకుండా వస్తువుల రవాణా పూర్తిగా నిషేధం.

- ఆటోమేటిక్‌ ఫేర్‌ కలెక్షన్‌ గేట్లను దూకే ప్రయత్నం చేయకూడ‌దు

- చెల్లుబాటయ్యే టిక్కెట్లను వాడాలి. గేట్లు తెరుచుకున్నాకే లోపలికి వెళ్లాలి

- స‌రైన కారణాల్లేకుండా రైలు డ్రైవర్‌ తో మాట్లాడకూడదు

- మెట్రో రైలు ప్రాంగణాల్లో హాకర్స్ తిరిగే వీల్లేదు

- రైలు దిగే/ ఎక్కే ఏ సమయంలో డోర్లకు దగ్గరలో ఉండొద్దు.

- జ‌ర్నీకి ఒక‌సారి టికెట్ మ‌ళ్లీ వాడ‌కూడ‌దు. వాడితే.. వెంట‌నే ప‌ట్టుకునే టెక్నాల‌జీ ఉంది

- ఒక‌సారి తీసుకున్న టికెట్‌ ను మ‌రోసారి వినియోగిస్తే జ‌రిమానా త‌ప్ప‌దు

- మెట్రో రైళ్లలో భద్రతా పరికరాలను ట్యాంపర్‌ చేయరాదు

చేయాల్సిన ప‌నులివే..

+ ఏ వస్తువులనైనా తప్పనిసరిగా చెత్త‌కుండీల్లో వేయాలి.

+ స్టేషన్‌ లోపల అనౌన్స్‌మెంట్లను జాగ్రత్తగా వినాలి.

+ ఏదైనా అవసరమైతే సమీపంలోని కస్టమర్‌ సర్వీస్‌ బృందాన్ని లేదంటే స్టేషన్‌ సిబ్బందిని సంప్రదించాలి.

+ ఎవరైనా ఇబ్బందులు క‌లిగిస్తే.. వెంట‌నే భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వాలి

+ స్టేషన్‌ సిబ్బంది.. భద్రతా సిబ్బందికి సహకరించాలి

+ మెట్ల మార్గాలు - ఎస్కలేటర్లపై జాగ్రత్తగా వెళ్లాలి

+ ప్రయాణికులు తమ సామగ్రిని జాగ్రత్తగా తీసుకువెళ్లాలి.

+ రైల్లో నిల‌బ‌డి వెళుతుంటే రైలు వెళుతున్న వైపు తిరిగి ఉండాలి. ఎస్కలేటర్‌ లో ఎప్పుడూ ఎడమ వైపు నిల్చోవాలి.

+ మెట్రోలో ప్రయాణం చేసేటప్పుడు వృద్ధులు - దివ్యాంగులు - మహిళలు - పిల్లలకు సహకరించాలి.

+ బేబీ బ్యాగీస్‌ - చక్రాల కుర్చీలో వెళ్లేవారు తప్పనిసరిగా లిఫ్టుల్లో ప్లాట్‌ ఫాం లెవల్‌ కు వెళ్లాలి.

+ టికెట్‌ కౌంటర్ల వద్ద - టిక్కెట్‌ వెండింగ్‌ మిషన్‌ ల ద‌గ్గ‌ర క్యూ పాటించాలి.

+ రైల్లో ఎక్కేందుకు వెళ్లే మార్గంలో ఉన్న ఆటోమేటిక్‌ ఫేర్‌ కలెక్షన్‌ గేట్స్‌ వద్ద క్యూలో వెళ్లాలి

+ మెట్రో రైలు ఎక్కేముందు ప్లాట్‌ ఫాంపై నిర్దేశిత దూరంలోనే నిలబడి ఉండాలి.

+ మెట్రో రైలు ప్రయాణం కోసం తీసుకున్న టోకెన్లను - స్మార్ట్‌ కార్డులను తనిఖీల వేళ చూపించాలి

+ అత్యవసర సమయాల్లో అధికారులు ప్రకటన చేయగానే స్టేషన్‌ ల నుంచి బయటకు వెళ్లిపోవాలి