Begin typing your search above and press return to search.

ఏపీలో హైబ్రీడ్ పవర్ ప్లాంట్లు

By:  Tupaki Desk   |   10 Oct 2015 7:28 AM GMT
ఏపీలో హైబ్రీడ్ పవర్ ప్లాంట్లు
X
ఆంధ్రప్రదేశ్ 2022 నాటికి 10వేల మెగావాట్ల సౌర, పవన విద్యుదుత్పత్తి లక్ష్యంగా సాగుతోంది. ఇందులో భాగంగా 2018-19 సంవత్సరాంతానికి ఐదువేల మెగావాట్లను ఉత్పత్తికి వివిధ సంస్థల భాగస్వామ్యంతో చేపట్టాలని నిర్ణయించింది. సౌర, పవన విద్యుదుత్పాదన వల్ల పర్యావరణానికి ముప్పు తలెత్తకుండా గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు సన్నాహాలు జరుగుతు న్నాయి. దేశంలోనే తొలిసారిగా నవ్యాంధ్రలో సౌర - పవన విద్యుత్తులను కలిపి హైబ్రిడ్‌ విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. నెడ్‌ క్యాప్‌ ఆధ్వర్యంలో పలు ప్రైవేటు సంస్థలతో ప్రభుత్వం ఇప్పటికే అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది. సౌర, పవన శక్తుల నుండి వేర్వేరుగా కాకుం డా ఒకే ప్లాంట్‌ లో విద్యుదుత్పత్తి చేస్తే ప్లాండ్‌ లోడ్‌ ఫాక్టర్‌ (పీఎల్‌ ఎఫ్‌) అధికంగా ఉంటుందన్నది కొత్త ఆలోచన.

జపాన్‌ కు చెందిన ఎస్‌ బీ సోలార్‌ సర్వీసెస్‌ ప్రైవేటు లిమిటెండ్‌, స్పెయిన్‌ కు చెందిన సుజలాన్‌ ఎనర్జీ, ఆక్సి యానా ఎనర్జీలు రూ. 19వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పం దాలు చేసుకున్నాయి. సౌర, పవన విద్యుదుత్పాదనతో యూనిట్‌ ఖర్చు తగ్గుతుందన్నది నిపుణుల మాట.

జపాన్‌కు చెందిన సాఫ్ట్‌ బ్యాంక్‌ గ్రూపు కంపెనీల అనుబంధ సంస్థలు ఎస్‌బీ సోలార్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌కు రూ. 18వేల కోట్ల పెట్టుబడితో రెండువేల మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టు, మరో వెయ్యి కోట్లతో పవన విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. స్పెయిన్‌ కు చెందిన ఆక్సియానా ఎనర్జియా రూ. 14 వందల కోట్లతో 200 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టును కర్నూలులో నెలకొల్పేందుకు ఎంఓయూ చేసుకుంది.

ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో ఈ హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయి. సౌర విద్యుత్ కేంద్రాలుకు భూమి ఎక్కువ అవసరం కావడం.. రాయలసీమ ప్రాంతంలో దొరుకుంతుండడంతో అక్కడ ఏర్పాటు చేస్తున్నారు.