Begin typing your search above and press return to search.

ఈ ఒక్క కాంగ్రెస్ సీటుపై 11మంది కన్ను

By:  Tupaki Desk   |   11 Oct 2018 2:39 PM GMT
ఈ ఒక్క కాంగ్రెస్ సీటుపై 11మంది కన్ను
X
ఎన్నికల వేళ సీట్ల కేటాయింపు వ్యవహారం కాంగ్రెస్ కు తలకు మించిన భారంగా మారింది. సీటు కోసం ఇద్దరు లేదా ముగ్గురు పోటీ పడటం సహజం. కానీ 11 మంది పోటీపడటం అసాధారణం. అదే జరుగుతంది పఠాన్ చెరు నియోజవర్గ కాంగ్రెస్ టికెట్ కోసం...

కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని అసమ్మతి నేతలను, కొత్తగా పార్టీలోకి వచ్చే వారిని చేర్చుకుంది. వీరిలో చాలా మంది టిక్కెట్ విషయం మాట్లాడుకొనే వచ్చామని, తమకే సీటు ఖాయమని ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీ పెద్దలతో రాయబారాలు నడుపుతూ లాబీయింగ్ చేస్తున్నారు. దీంతో ఎవరికీ పటాన్ చెరు సీటు దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది.

ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు రేవంత్ తో పాటు శశికళ యాదవ్ కూడా టిక్కెట్ రేసులో ఉన్నారట. టీఆర్ ఎస్ లో టిక్కెట్ కోసం ప్రయత్నించి విఫలమైన గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ లో చేరిపోయారు. ఈయన పార్టీలోకి వచ్చేటప్పుడే టిక్కెట్ బేరం మాట్లాడుకునట్లు చెబుతున్నారు. ఈయనతో పాటే టీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అయిన సఫన్ దేవ్ - వడ్డెర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాములు - జిన్నారం మాజీ జడ్పీటీసీ బాల్ రెడ్డి - ఎంపీపీ రవీందర్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చేశారు. వీరందరు పఠాన్ చెరు టిక్కెట్ కేటాయించాలని అడుగుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత - కార్పొరేటర్ శంకర్ యాదవ్ కూడా టిక్కెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు.

ఇలా కాంగ్రెస్ లో ఉన్న నేతలు - చేరిన నేతలు కాంగ్రెస్ టిక్కెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. టిక్కెట్ల వ్యవహారం ఒక కొలిక్కి తీసుకువచ్చి అభ్యర్థులను ప్రటిద్దామనుకున్నా.. కాంగ్రెస్ పెద్దలకు ఒక్కో నియోజకవర్గం ఒక్కో సవాల్ ను విసురుతుంది. మరి పఠాన్ చెరు టిక్కెట్ వ్యవహారాన్ని ఎలా తేలుస్తారోనన్న చర్చ జోరుగా సాగుతుంది. కార్యకర్తలు కూడా కాంగ్రెస్ టికెట్ దక్కే ఆ ఒక్కరు ఎవరని ఎదురుచూస్తున్నారు. త్వరలో తేల్చేసే పనిలో కూటమి నేతలు పడిపోయారట. తెలంగాణలో అతి పోటీ ఉన్న నియోజకవర్గంగా పటాన్ చెర్వు నిలిచింది.