Begin typing your search above and press return to search.

హరీష్ రావు పై వెల్లువెత్తిన అభిమానం

By:  Tupaki Desk   |   15 Dec 2018 11:21 AM GMT
హరీష్ రావు పై వెల్లువెత్తిన అభిమానం
X
ట్రబుల్ షూటర్ పై అభిమానం పోటెత్తింది. నాయకులు, కార్యకర్తలు ఆయన అభిమానులు హరీష్ రావు ను కలిసేందుకు హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ కు తరలివచ్చారు. వందలాది మంది అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు ఆయన నివాసానికి తరలిరావడంతో హైదరాబాద్ లోని బంజరాహిల్స్ రోడ్లు కిక్కిరిసాయి. మినిస్టర్ క్వార్టర్లు అన్ని జనంతో నిండిపోయాయి.

తాజా గా కేటీఆర్ ను సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించిన సంగతి తెలిసిందే.. హరీష్ రావు కూడా దీని పై స్పందించి హర్షం వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితిలోనే గొప్ప అభిమాన సంద్రాన్ని సంపాదించుకొని జనం నేతగా పేరుగాంచిన హరీష్ రావు ఈ నిర్ణయంతో ఏమైనా నొచ్చుకున్నాడేనన్న సందేహంతో చాలా మంది హరీష్ రావును కలిసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తరలిరావడం సంచలనంగా మారింది.

కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ లో అశేష అభిమాన గణం, నేతల సపోర్టు హరీష్ రావుకు ఉంది. కేటీఆర్ కూడా అదే ఫాలోయింగ్ ఉంది. అందరికీ అందుబాటులో ఉండే.. అందరి కష్టాలు తీర్చే మనసున్న నేత గా హరీష్ రావు కు మంచి పేరుంది. హరీష్ ప్లాన్ చేస్తే అక్కడ ప్రత్యర్థులు ఓడిపోవాల్సిందేనంతగా ఆయన వ్యూహాలుంటాయి. తాజా ఎన్నికల్లో కొడంగల్ లో రేవంత్ రెడ్డి ని, గజ్వేల్ లో కేసీఆర్ ను గెలిపించి హరీష్ రావు మరోసారి తన సత్తాచాటారు. టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ గా పేరొంది పార్టీకి ఆపద్భాంధవుడి గా మారారు. కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం నేపథ్యంలో హరీష్ అభిమానులు ఆయన్ను కలిసేందుకు రావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాశంగా మారింది.