నంద్యాల బైపోల్... 1000 కోట్ల బెట్టింగ్

Sun Aug 13 2017 22:47:38 GMT+0530 (IST)

ఏపీలో అత్యంత ప్రతిష్ఠాత్మ కంగా మారిన నంద్యాల ఉప ఎన్నికలపై బెట్టింగులు భారీ స్థాయిలో సాగుతున్నాయి. మరీ ముఖ్యంగా రాయలీసీమలో జరుగుతున్న ఈ ఎన్నికపై రాజధాని ప్రాంతం విజయవాడలో తీవ్రమైన ఆసక్తి ఏర్పడింది. బాగా బలిసిన రాజకీయ నేతలంతా ఈ ఎన్నికపై బెట్టింగులు కాస్తున్నారట.  టీడీపీ బలాలేంటి?  వైసీసీ బలహీనతలేంటి? అనే అంశాలపై అందరూ చర్చ నడుపుతున్నారు. ఏకంగా రాష్ట్రంలో వెయ్యి కోట్ల మేర బెట్టింగులు సాగుతున్నట్లు సమాచారం.
    
నంద్యాల ఎన్నిక మొత్తం కులాల వారీగా లెక్కలు తేల్చాల్సిన పరిస్తిిలోకి వచ్చింది.  దీంతో కుల సమీకరణల ఆధారంగా బెట్టింగ్ రాయుళ్లు పందాలు కాస్తున్నారు.  ఇది ఎంతవరకు వెళ్లిందంటే ఈ బెట్టింగులు ఏపీని దాటి  హైదరాబాద్‌కు కూడా పాకేశాయి.   అయితే ఎక్కువగా బెట్టింగ్‌లకు కేరాఫ్ అడ్రస్ అయిన గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ గుంటూరు జిల్లాలో ఈ ఫీవర్ ఎక్కువగా కనిపిస్తోంది. రాజకీయ నేతలు ఈ పందాలలో ఎక్కువగా కనపడుతున్నాయి. ఎవరి స్థోమతను బట్టి వారు బెట్టింగ్ వేస్తున్నారు. లక్ష నుంచి కోటి రూపాయల వరకు ఈ బెట్టింగ్‌లు జరుగుతున్నాయి.
    
టీడీపీ నేతలు కూడా నంద్యాల బై పోల్ పై బాగా బెట్టింగులు కాస్తున్నారు. విజయవాడలో పేరు మోసిన ఓ టీడీపీ లీడర్ భారీగానే బెట్టింగ్‌లు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక విజయవాడలోనే 100 కోట్ల బెట్టింగ్‌లు దాటినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏపీ వ్యాప్తంగా ఈ బెట్టింగ్‌లు 1000 కోట్లు దాటే అవకాశం ఉందని సమాచారం.