Begin typing your search above and press return to search.

తెలంగాణ ఎన్నికలపై ఏపీలో పందాలు

By:  Tupaki Desk   |   20 Oct 2018 11:07 AM GMT
తెలంగాణ ఎన్నికలపై ఏపీలో పందాలు
X
తెలంగాణ ఎన్నికలు.. ఇక్కడి పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారింది. అదే సమయంలో ఏపీలోని కొందరు సరదా బాబులకు పందెంగా మారింది. ఇప్పుడు తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుంది..? ఎవరు గద్దెనెక్కుతారు...? ఫలానా నియోజకవర్గంలో ఆ తాజామాజీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుస్తాడా అనే దానిపై పందెం రాయుళ్లు భారీగా బెట్ లు కడుతున్నారు. లక్షల్లోనే ఈ పందెం పాటలు సాగుతున్నట్టు సమాచారం. తెలంగాణలో పొలిటికల్ హీట్ ఏపీ పందెం రాయుళ్లకు కాసులు కురిపిస్తోందట.

తెలంగాణలోని గెలుపు గుర్రాలైన నాయకులు గెలుస్తారా.? ఓడుతారా అన్న దానిపై ఏపీలో రెండు గోదావరి జిల్లాల్లో జోరుగా పందాలు కడుతున్నారు. పక్కనున్న ఖమ్మం నియోజకవర్గంలో వీరు ఫోకస్ ఎక్కువగా ఉంది. తుమ్మల మెజార్టీ - పువ్వాడ గెలుపు సహా పిడమర్తి - కొత్త గూడెం జలగంపై భారీ పందాలు కాస్తున్నారు. ఇక హరీష్ రావు ఈసారి లక్ష మెజార్టీ కొట్టి రికార్డ్ సృష్టిస్తాడా అన్న దానిపై కూడా పందాలు కాస్తున్నట్టు సమాచారం. గోదావరి జిల్లాల్లోని శివారు మామిడి తోటలు - క్లబ్ - వివిధ అడ్డాల్లో ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో గెలుపు ఓటములపైనే లక్షల్లో పందాలు కాస్తు పందెంరాయుళ్ల కాసులు వెదజల్లుతున్నట్టు సమాచారం.

అయితే ప్రస్తుతానికి టీఆర్ ఎస్ నేతలపైనే ఈ పందాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్-మహాకూటమి టికెట్ల కేటాయింపు పూర్తి చేసి ప్రత్యర్థులను దించాక నియోజకవర్గాల వారీగా టీఆర్ఎస్ వర్సెస్ మహాకూటమి అభ్యర్థులపై లక్షల్లోనే పందాలు కాసేందుకు రెడీ అయ్యారట.. మరి తెలంగాణ ఎన్నికల్లో ఫలితాలు పందెం రాయుళ్లకు అనుకూలిస్తాయా.? షాకిస్తాయా. తేలాలంటే డిసెంబర్ 7వరకూ ఆగాల్సిందే..