Begin typing your search above and press return to search.

సరిహద్దులకు యుద్దసామాగ్రి తరలిస్తున్నారా?

By:  Tupaki Desk   |   30 Sep 2016 10:45 AM GMT
సరిహద్దులకు యుద్దసామాగ్రి తరలిస్తున్నారా?
X
సర్జికల్ స్ట్రైక్ దాడులతో భారత్ - పాకిస్థాన్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే! ఉరీ దాడుల నేపథ్యంలో - తాజాగా జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం ఏ సమయంలోనైనా యుద్ధాన్ని ప్రకటించే అవకాశం ఉందనే ఊహాగానాలు జాతీయ మీడియాల్లో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్ - దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న యుద్ధ సామాగ్రిని సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తున్నట్లుంది! అందులో భాగమో ఏమో కానీ.. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆర్మీ యుద్ధ సామాగ్రిని విశాఖ మీదుగా రైలు వ్యాగెన్లలో యుద్ధ ట్యాంకులను తీసుకెళ్తున్న దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ దృశ్యాలు నాలుగైదు రోజుల క్రితంవి అని తెలుస్తుంది.

ఉరి ఘటన అనంతరం భారత ప్రభుత్వం ముందుగానే ఒక చర్యపై సంసిద్ధత వ్యక్తం చేయడం - అంతర్గతంగా జరిగిన పరిణామాలు - చర్చల్లో ఈ మేరకు కొన్ని కీలక నిర్ణయాలు వెలువడటమో ఏమో కానీ... వివిధ ప్రాంతాల నుంచి ఆర్మీకి సంబందించిన ట్రక్కులు - ఆయుధ సామాగ్రి పెద్ద ఎత్తున సరిహద్దు ప్రాంతాలని తరలి వెళుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. యురీ ఘటన అనంతరం పెద్ద ఎత్తున సరిహద్దు ప్రాంతాల్లో అవసరమైన చోట - ఎక్కడెక్కడైతే సర్జికల్ అటాక్స్ చేసిన అనంతరం పాక్ తిరిగి దాడులు చేస్తుందని ముందుగానే ఊహించారో ఆయా ప్రాంతాలకి పెద్ద ఎత్తున సైనికులతో పాటు ఆయుధ సంపత్తిని తరలించే పనులను భారత ప్రభుత్వం ముందుగానే చేపట్టింది. అందులో భాగంగానే ఇలా ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటుంది!!

కాగా, ఆర్మీకి సంబందించిన విషయాల్లో ఏ చిన్న అధికారి కాని - ఉద్యోగి నుంచి కానీ మీడియాకు ఎలాంటి లీకులు రావు కాబట్టి... వీటిని ఎందుకు తరలిస్తున్నారనేది భవిష్యత్తులో జరిగే పరిణామాల అనంతరం మాత్రమే నిర్ధారించుకోగలం!