Begin typing your search above and press return to search.

స్టార్ హోటల్ లో దుశ్శాసన పర్వం

By:  Tupaki Desk   |   18 Aug 2017 2:29 PM GMT
స్టార్ హోటల్ లో దుశ్శాసన పర్వం
X
ఢిల్లీ ఏరోస్పేస్ సిటీలోని ఓ ఫైవ్‌ స్టార్ హోటల్‌ లో దుశ్శాసన పర్వం ఆలస్యంగా వెలుగుచూసింది. మహిళా ఉద్యోగిపై వేధింపులకు పాల్ప‌డ‌గా అత‌డి ఆకృత్య వీడియో సంచలనంగా మారింది. సెక్యూరిటీ మేనేజర్‌ పవన్‌ దహియా ఓ మహిళా ఉద్యోగి చీర పట్టుకుని లాగుతున్న దృశ్యం వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలని హోటల్ యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. నిందితుడిని మాత్రం సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది.

కొంతకాలంగా మహిళా ఉద్యోగినిని తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని పవన్‌ దహియా వేధిస్తున్నాడు. ఇందుకు ఆ మహిళ నో చెప్పింది. దీంతో, జులై 29 న ఆమె పుట్టిన రోజు సందర్భంగా తన క్యాబిన్‌ లోకి పిలుచుకున్నాడు. తన క్రెడిట్‌ కార్డు ఇచ్చి గిఫ్ట్‌ కొనుక్కోవాలని సూచించాడు.అయితే అందుకు ఉద్యోగిని అంగీకరించకపోవడంతో... ఆమె చీర పట్టుకొని లాగి తనపై కూర్చోమని బలవంతం చేశాడు. అయితే ఇదంతా గ‌మ‌నిస్తున్న మ‌రో ఉద్యోగిని సైతం మేనేజ‌ర్ ద‌హియా బెదిరించాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

ఈ వీడియో వైర‌ల్‌ గా మారిన నేప‌థ్యంలో బాధితురాలు తాజాగా మీడియాతో మాట్లాడింది. త‌తో సంబంధం పెట్టుకోవాల‌ని ఒత్తిడి చేసిన య‌జ‌మాని గురించి త‌మ హెచ్ ఆర్ విభాగంలోని తమ మేడమ్ కు ఫిర్యాదు చేసిన‌ట్లు తెలిపారు. మేనేజర్‌ కు వార్నింగ్ లెటర్ ఇస్తాన‌ని తెలిపి, ఆ తర్వాత ఆయన నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారని చెప్పారని బాధితురాలు వెల్లడించారు. అయితే ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త త‌గు చ‌ర్య‌లు లేక‌పోవ‌డంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. కాగా, సంబంధిత సెక్యురిటీ మేనేజ‌ర్‌ ను సస్పెండ్ చేసిన‌ట్లు పీఆర్ అధికారి తెలిపారు.